VhP విశ్వహింధూ పరిషత్ యాదాద్రి భువనగిరి

  • Home
  • India
  • Bhongir
  • VhP విశ్వహింధూ పరిషత్ యాదాద్రి భువనగిరి

VhP విశ్వహింధూ పరిషత్ యాదాద్రి భువనగిరి Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from VhP విశ్వహింధూ పరిషత్ యాదాద్రి భువనగిరి, Social Media Agency, vidyanagar, Bhongir.
(1)

11/02/2023

ఈరోజు భువనగిరిలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వాలెంటైన్ డే వ్యతిరేక పోస్టర్ ఆవిష్కరణ జైశ్రీరామ్🚩🚩🕉️

25/11/2022

*యాదగిరిగుట్టలోని క్రైస్తవ మత ప్రచారాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం*
*బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శనివారం రోజున ఉదయం: 10 గంటలకు యాదగిరిగుట్టలో నిర్వహించడం జరుగుతుంది.కావును హిందూ బంధువులు అందరూ వచ్చి విజయవంతం చెయ్యాలి🙏🚩* *యాదాద్రి-భువనగిరి జిల్లా బజరంగ్ దళ్*

07/07/2020

శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి క్షేత్ర పాలకుడైన శ్రీ అంజనేయ స్వామి గుడిని కాపాడుకుందాం రెండు వందల సంవత్సరాల పురాతన స్వామి వారి గుడి భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షమై అశ్వద్ధ వృక్షం ఆంజనేయస్వామి గుడి లో ఉండడం దివ్య విశేషం ఎందరో భక్తులకు కష్టాలు ఆపదలు కష్టాలు బాధలు తొలగిన మైమగల ఆంజనేయ స్వామి గుడి సీతారాముల స్వామి వారిని గుండెల్లో నిలుపుకున్న మన ఆంజనేయ స్వామి మనకు అండ దండ ఉన్నాడు ఆంజనేయస్వామి గుడిని కూల్చాలని నిర్ణయించుకున్నారు కావున స్థానికులు స్థానికులు భక్తులు అందరం కలిసి శ్రీ ఆంజనేయ స్వామి వారి గుడి ని కాపాడుకుందాం సీతారామ జానకి జై బోలో హనుమానుకి జై జై హనుమాన్ కి జై

07/07/2020
దానంతోనే జన్మకు సార్థకత :VHP నేత రాఘవులుజి"కృతయుగంలో తపస్సు... త్రేతాయుగంలో జ్ఞానం... ద్వాపరయుగంలో యజ్ఞం... కలియుగంలో దా...
04/07/2020

దానంతోనే జన్మకు సార్థకత :VHP నేత రాఘవులుజి

"కృతయుగంలో తపస్సు...
త్రేతాయుగంలో జ్ఞానం...
ద్వాపరయుగంలో యజ్ఞం...
కలియుగంలో దానం..
అనేవి మనిషి జన్మ కు సార్థకతను చేకూరుస్తాయి, ముక్తిని కలిగిస్తాయి అనేది వేదాల సారాంశం" అని విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శ్రీ రాఘవులు గారు అన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారి కారణం చేత మానవాళికి అతి పెద్ద ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే నని.. ఈ కష్టకాలంలో మనిషికి మనిషి తోడ్పాటు నందించడం అత్యంత ఆవశ్యకం అన్నారు. ఇలాంటి విపత్కర సందర్భంలో సేవా భావం కలిగిన వారు తమ శక్తికి మించి దానధర్మాలు చేయడం.. నిస్సహాయులకు అండగా నిలవడం.. అభాగ్యులను ఆదుకోవడం సమాజానికి ఆదర్శం అన్నారు. కోవిద సహృదయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ అనూహ్య రెడ్డి గారు తన సొంత ఖర్చుతో వంద రోజుల పాటు పేదలకు సహాయం చేయడం చాలా గొప్ప విషయమన్నారు. కరోనా నివారణ కోసం భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ప్రారంభం నుంచి అంటే మార్చి 26 నుంచి, జూలై 3వ తేదీ వరకు వంద రోజులుగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రాఘవులు గారు అనూహ్య రెడ్డి గారిని ప్రశంసించారు. ఈ సందర్భంగా అనూహ్య రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు. ఇటీవల కాలంలో కొంతమంది ప్రముఖులను మనం చూశామని.. వారిలో రతన్ టాటా, అక్షయ్ కుమార్ ,సోను సూద్ మిగతా అనేక మంది ప్రముఖులు ప్రత్యక్షంగా పరోక్షంగా సమాజానికి అండగా నిలబడ్డారనీ.. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా డాక్టర్ అనూహ్య రెడ్డి నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవతకు అద్దం పడుతోందన్నారు. మార్చి 26 నుంచి మొదలు పెడితే ఈరోజు (శనివారం) వరకు ఏకధాటిగా, నిత్యం ఎక్కడో ఒక దగ్గర పేదలకు, అర్హులకు నిత్యావసర సరుకుల తో కూడిన కిట్లను ప్రదానం చేయడం ఆదర్శ మన్నారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బండారు రమేష్ గారు, రాష్ట్ర సహ కార్యదర్శి శ్రీ రాజేశ్వర్ రెడ్డి గారు, ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కో కన్వీనర్ శివరాం గారు, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రచ్చ శ్రీనివాసులు గారు, కలయిక ఫౌండేషన్ చైర్మన్ శ్రీ చేరాల నారాయణ గారు అనుహ్య రెడ్డిని అభినందించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...తాను సంపాదించిన సొమ్ముతో స్వచ్ఛందంగా పేదలకు సేవ చేయడం, కష్టకాలంలో ఆదుకోవడం గొప్ప విషయమన్నారు. సిరి సంపదలు ఎన్ని ఉన్నా స్పందించే హృదయ మే గొప్పదని కీర్తించారు." కోవిద సహృదయ పౌండేషన్" ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు హైదరాబాద్ నగరంతో పాటు, రాష్ట్రమంతా కొనసాగాయి అని గుర్తు చేశారు. మొత్తం సేవా కార్యక్రమాలు పూర్తిచేసి, యజ్ఞం నిర్వహించాలని సంకల్పించడం దైవకార్యం తో సమానం అని విశ్వహిందూ పరిషత్ నాయకులు పేర్కొన్నారు.

 #భువనగిరి మండలం హన్మపురం గ్రామ పరిధిలో నిరాటంకంగా సాగుతున్న అక్రమ చర్చి నిర్మాణం, అధికారులకి విన్నవించుకున్నా పట్టించుక...
02/07/2020

#భువనగిరి మండలం హన్మపురం గ్రామ పరిధిలో నిరాటంకంగా సాగుతున్న అక్రమ చర్చి నిర్మాణం, అధికారులకి విన్నవించుకున్నా పట్టించుకునే పరిస్థితి లేదు #విశ్వహిందూ_పరిషత్

02/07/2020

ఆహా ! దాదాపు 100 కి.మీ లు నడచి తొలి ఏకాదశి నాడు పండరి పుర విఠల దర్శనం చేసుకునే "వారి " సంప్రదాయం ఇది. తీరా పండరి బయట దేవుని దర్శనం లేదని పోలీసు ఆపగానే ... నీవు నిలబడిన తీరులోనే నాకు విఠలుడు కానిపిస్తున్నాడని పోలీసు కు దండం పెట్టి వెనుదిరుగుతున్న భక్తుడు. దేవుడంటే ఎక్కడో పైన కనిపించ కుండ ఉంటాడనే భ్రమను దాటి రాతి విగ్రహం లోను, ఎదురు గున్న మనిషిలోను చూడగలిగే భక్తుడు ధన్యుడు. ఇటువంటి స్థితి కి తెచ్చే సనాతన ధర్మం లో పుట్టిన మనం ధన్యులం🙏🏻

🚩🚩🚩🚩🚩🙏

 # #యాదాద్రి భువనగిరి యాదగిరిగుట్ట లోని వీరాంజనేయ స్వామి దేవాలయ తొలగింపును  విరమించుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి వివిధ...
29/06/2020

# #యాదాద్రి భువనగిరి యాదగిరిగుట్ట లోని వీరాంజనేయ స్వామి దేవాలయ తొలగింపును విరమించుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి వివిధ హిందూ క్షేత్రాల పెద్దలతో మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని,భారతీయ జనతాపార్టీ మరియు భజరంగ్ దళ్ శ్రేణులు పాల్గొన్నాయి* # #

🚩*జై శ్రీరామ్ జై జై శ్రీరామ్*🚩

తేది 30-06-2020 మంగళవారం రోజున ఉదయం 9 గంటలకు యాదగిరిగుట్ట లోని వీరాంజనేయ స్వామి దేవాలయ తొలగింపును  విరమించుకోవాలని నిరసి...
29/06/2020

తేది 30-06-2020 మంగళవారం రోజున ఉదయం 9 గంటలకు యాదగిరిగుట్ట లోని వీరాంజనేయ స్వామి దేవాలయ తొలగింపును విరమించుకోవాలని నిరసిస్తూ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుంది కావున హిందూ బంధువులు వివిధ క్షేత్ర కార్యకర్తలు తప్పకుండా పాల్గొనాలి

30/06/2020 మంగళవారం రోజు  ఉదయం 9:00 గంటలకు యాదగిరిగుట్టలొని  వీరాంజనేయా స్వామి టెంపుల్ లో ఆలయ రక్షనకై మాహ  హనుమాన్ చాలిస...
28/06/2020

30/06/2020 మంగళవారం రోజు ఉదయం 9:00 గంటలకు యాదగిరిగుట్టలొని వీరాంజనేయా స్వామి టెంపుల్ లో ఆలయ రక్షనకై మాహ హనుమాన్ చాలిసా పారాయణం వుంటుంది హనుమాన్ భక్తులు అందారూ తప్పకుండా హాజరు కాగలరు*

*జై శ్రీరామ్ జై జై శ్రీరామ్*

యాదాద్రి లో వైకుంఠ ద్వారం పక్కన  ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చే ప్రయత్నం జరుగుతుంది 200 సం చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామ...
27/06/2020

యాదాద్రి లో వైకుంఠ ద్వారం పక్కన ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చే ప్రయత్నం జరుగుతుంది 200 సం చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి దేవాలయం తెలంగాణలో ఉన్న ఒక్కే ఒక్క దేవాలయం అశ్వధ వృక్షం (రావి చెట్టు)కలిసి ప్రదక్షిణం చేసే ఓకే ఒక్క దేవాలయం.అధివృద్ది అనే యాదాద్రి లో ఉన్న దేవాలయాలు ,ఆశ్రమాలు కలుస్తున్నారు ఇది కోట్లాది హిందువుల మనోభావాలను కించపరిస్తున్న ytda యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అతరిటీ యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణం పేరునా దేవాలయాలు కూర్చడం అభివృద్ధి కాదు హిందువుల మనోభవాలు కించపరిస్తురు వెంటనే ఆపాలి హిందులంతా సంఘాటితం కావాలి మన దేవాలయాలు మనేమ్ కాపాడుకోవాలి.

యదాద్రి లో అభివృద్ధి పేరిట హిందువుల మనోభావాలు దెబ్బతినే  ప్రయత్నంగా పురాతన చరిత్ర గల మహిమ గల  #హనుమాన్_దేవాలయాని తొలిగిం...
27/06/2020

యదాద్రి లో అభివృద్ధి పేరిట హిందువుల మనోభావాలు దెబ్బతినే ప్రయత్నంగా పురాతన చరిత్ర గల మహిమ గల #హనుమాన్_దేవాలయాని తొలిగించే ప్రయత్నం చేస్తున్న YTDA.
తొలిగించే ప్రయత్నం వెంటనె మనుకొవాలి అని #విశ్వహిందూ_పరిషత్ #బజరంగ్_దళ్ డిమాండ్ చేస్తుంది లేదంటె హిందువుల ఆగ్రహం చూడలేరు అని హెఛరించటం జరిగింది.

*జై శ్రీ రామ్*🙏⛳🙏 *యాదాద్రి అభివృద్ది లో భాగంగా YTDA (యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ) నిర్వహించిన ఘనకార్యాలు*యాదాద...
27/06/2020

*జై శ్రీ రామ్*🙏⛳🙏

*యాదాద్రి అభివృద్ది లో భాగంగా YTDA (యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ) నిర్వహించిన ఘనకార్యాలు*

యాదాద్రి ఆలయ అభివృద్ధి లో .... రోడ్డు విస్తరణ లో మనం *కోల్పోయిన మన స్థానిక దేవాలయాలు*

🔹 యాదగిరి పల్లి లో పాలిటెక్నిక్ కాలేజీ వెనకాలా ఉన్న *జగన్నాథ మందిరం, అఖండనామ సంకీర్తన ఆశ్రమం*

🔹 *ఇదే రోడ్డు ను అలైన్మెంట్ మార్చి మసీదు కు ఎదురుగా రోడ్డు వస్తుందని రిజిస్ట్రార్ ఆఫీస్ పక్కన గల దుర్గమ్మ గుడి నీ తీసేసే విధంగా మార్చిన ఘనత మన YTDA అధికారులది*

🔹 యాదాద్రి ఘాట్ రోడ్డు ప్రారంభం లో ఆర్యవైశ్య సత్రం పక్కన గల *విష్వక్సేన ఆలయం కూల్చేశారు*

🔹 లక్ష్మీ నరసింహ స్వామి కొలువు దీరడానికి కారణమై తపస్సు చేసిన *యాదరుషి తపస్సు చేసిన పురాతన (అశ్వత్ధ వృక్షం) మర్రి చెట్టు ను నరికేస్తారు....ఇదేమిటని YTDA వైస్ చైర్మన్ కిషన్ రావు గారిని ప్రశ్నిస్తే .... ఏమో అది నాకు తెలియదు కనుక్కుంటా అంటాడు.*

🔹 *ఇపుడేమో సింహ ద్వారం వద్ద గల పురాతన ఆంజనేయుని ఆలయం తొలగించడానికి ఒస్తున్నారు*

27/06/2020
 #జైశ్రీమన్నారాయణ #సామాజిక_సామరస్యత అనే అంశముపై  #విశ్వహిందూపరిషత్_ఆధ్వర్యంలో #అప‌ర‌రామానుజులు_ప‌ర‌మహంస_ప‌రివ్రాజ‌కులు  ...
24/06/2020

#జైశ్రీమన్నారాయణ

#సామాజిక_సామరస్యత అనే అంశముపై
#విశ్వహిందూపరిషత్_ఆధ్వర్యంలో
#అప‌ర‌రామానుజులు_ప‌ర‌మహంస_ప‌రివ్రాజ‌కులు #జ‌గ‌దాచార్యులు_జగద్గురువులు_శ్రీశ్రీశ్రీత్రిదండి_శ్రీమ‌న్నారాయ‌ణ‌ #రామానుజ‌_చిన్న‌జీయ‌ర్_స్వామివారి_ప్రవచనం
#ఫేస్_బుక్_లైవ్_లో

#జైశ్రీమన్నారాయణ

మన కార్యకర్తల పోన్లలొ ఎవరూ కూడా చైనా apps వాడకూడదు దయచేసి  అందారూ డెలిట్ చేయగలరు ఎవరూ చైనా వస్తువులను కొనవద్దు* స్వదేశీ ...
21/06/2020

మన కార్యకర్తల పోన్లలొ ఎవరూ కూడా చైనా apps వాడకూడదు దయచేసి అందారూ డెలిట్ చేయగలరు ఎవరూ చైనా వస్తువులను కొనవద్దు* స్వదేశీ వస్తువులు కొని మన దేశ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపరుచుకొని చైనా పాకిస్తాన్ లకు భారత్ అంటె ఎంటో చూపిద్దాం....జై హింద్

చైనా కు భారత్ అంటె ఎంటో చూపించాలి...జై హింద్
21/06/2020

చైనా కు భారత్ అంటె ఎంటో చూపించాలి...జై హింద్

20/06/2020

చైనా apps అందారూ డెలిట్ చేయాలి.....

విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ భువనగిరి ఆధ్వర్యం లో నేడు స్థానిక వినాయక చౌరస్తా లో చైనా జెండా మరియు వస్తువులు దహనం చేయడం...
20/06/2020

విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ భువనగిరి ఆధ్వర్యం లో నేడు స్థానిక వినాయక చౌరస్తా లో చైనా జెండా మరియు వస్తువులు దహనం చేయడం జరిగింది

*విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ భువనగిరి  ఆధ్వర్యంలో*  రేపు ఉదయం 10:30 గంటలకు  మన భువనగిరి *వినాయక చౌరస్తా లో*  *చైన వస్తు...
19/06/2020

*విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ భువనగిరి ఆధ్వర్యంలో*

రేపు ఉదయం 10:30 గంటలకు మన భువనగిరి *వినాయక చౌరస్తా లో* *చైన వస్తువుల దహన కార్యక్రమం నిర్వహించటం జరుగుతుంది* కావున కార్యకర్తలందరూ హజరై .చైనా దురాక్రమన ను అడ్డుకుని వీర మరణం పొందిన వీర సైనికులను స్మరించుకుంద్దాం..........

*జై జవాన్ జై శ్రీరామ్*

జై హింద్ జై శ్రీరామ్
18/06/2020

జై హింద్ జై శ్రీరామ్

వీరుడా నీ త్యాగం వృధా కాదు నీ మరణం యావత్ భారత దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోర...
18/06/2020

వీరుడా నీ త్యాగం వృధా కాదు నీ మరణం యావత్ భారత దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ జై జవాన్ జై భారత్ ✊🇮🇳🇮🇳🇮🇳🇮🇳 అమరుడి కుటుంబానికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ దేవుడు నీ కోరుకుంటున్నాను 🙏🙏

13/06/2020

మన హిందూ ధర్మం గురించి చెప్పే వాళ్లు లేక చెడిపోతున్న ఈ సమాజానికి ఈ చిన్న వీడియో మేలు కొలుపు ఈ మారు మనసు

నేను నాస్తికుడినే.. కానీ  నికార్సైన హిందువును:  సినీ నటుడు నాగబాబు*** శాంతి.. సహనం అంటూ హిందువుల్లో పౌరుషాన్ని చంపేశారు ...
12/06/2020

నేను నాస్తికుడినే.. కానీ నికార్సైన హిందువును:
సినీ నటుడు నాగబాబు

*** శాంతి.. సహనం అంటూ హిందువుల్లో పౌరుషాన్ని చంపేశారు

**** సృష్టిలో హిందుత్వం అతి శ్రేష్టమైనది

*** ఆర్ఎస్ఎస్ లో ప్రచారక్ వ్యవస్థ చాలా గొప్పది

**** కాషాయం కండువా చాలా విలువైనది

"శాంతి.. సహనం.. ఓపిక ..ధర్మం అనే పదాలు ఉపయోగించి హిందువులలో ఉన్న పౌరుషాన్ని, ఆగ్రహాన్ని కొంతమంది పెద్దలు చంపేశారు" అని ప్రముఖ సినీ నటుడు నాగబాబుగారు ఆవేదన వ్యక్తం చేశారు. వేల, లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిన హిందుత్వాన్ని నేడు అంటరాని దానిగా చేశారని అభిప్రాయపడ్డారు. పరమత సహనం గల హిందువుల రక్తంలో దురాక్రమణ అనేదానికి చోటే లేదని, దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. స్వతహాగా తాను నాస్తికుడిననీ, ( దేవుడికి మాత్రమే పూజ చెయ్యను) కానీ నికార్సైన హిందువుని అని గర్వంగా చెప్పారు. హిందూ సంస్కృతి.. సంప్రదాయం.. ఆచార వ్యవహారాలు.. కట్టుబాట్లు.. సేవా తత్వం.. నియమనిష్టలు.. అన్ని కూడా నచ్చుతాయని, అందుకే.. "నేను హిందుత్వాన్ని పూర్తిగా నమ్ముతానని" అని చెప్పారు. హిందుత్వం అనేది భరత భూమిలో పుట్టిన మతం అని, మిగతావి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వేనని వివరించారు. "ధర్మం వేరు, హిందుత్వం వేరు.. హిందుత్వం అనేది అతి పవిత్రమైన.. పురాతనమైన.. శ్రేష్టమైన మతం" అని నాగబాబు చెప్పారు. ప్రస్తుతం హిందుత్వాన్ని పెకిలించి వేయాలని అనేక శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే హిందుత్వాన్ని కాపాడుతున్నది విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ మాత్రమేనని ఉదాహరణలతో సహా వివరించారు. ఈ దేశం పై ప్రేమ, అభిమానాలు ఉన్నది స్వయంసేవకులకు మాత్రమేనని అన్నారు. దేశంలో ఉంటూ వందేమాతరం కూడా పలకని వారు చాలా మంది ఉన్నారని విమర్శించారు. గోవులను రక్షిస్తూ, మత మార్పిడులను అడ్డుకుంటూ ప్రాణాలకు తెగించి పని చేస్తున్న విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు నిజమైన భరతమాత పుత్రులు అని అన్నారు. "ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థల్లో ప్రచారక్ వ్యవస్థ చాలా గొప్పదని" అభివర్ణించారు. జీవితాలను త్యాగం చేసి, సర్వం హిందుత్వ వ్యాప్తి కోసం పని చేయడం పూజనీయమని చెప్పారు.

శుక్రవారం నాగబాబు గారిని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బండారి రమేష్ గారు, భాగ్యనగర్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ రాజా గారు, ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ స్టేట్ కో కన్వీనర్ శివరాములు మర్యాదపూర్వకంగా కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా నాగబాబుగారు అనేక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. కాశ్మీర్ లో పండితులను ఊచకోత కోస్తే స్పందించని వారు, మహారాష్ట్రలో సాధువులను క్రూరంగా చంపేస్తే చలించని వాళ్లు, దేశంలో అనేకచోట్ల హిందువులపై ఘోరాలు జరుగుతున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న మీడియా, సెక్యులరిస్టు లు అందరూ కూడా నేడు.... అమెరికాలో ఎవరో ఒక వ్యక్తిని చంపేస్తే స్పందించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ దేశంలో గాడిద చనిపోతే విలువ ఉంది కానీ, హిందువు హత్యకు గురైతే అడిగే వారే లేరని అసహనం వ్యక్తం చేశారు. మొత్తంగా హిందువులంతా చైతన్యమై తేనే భారతదేశ మనుగడ సాధ్యమని, లేదంటే చాలా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .

అంతకుముందు నాగబాబు గారిని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్ గారు కాషాయ శాలువాతో సన్మానం చేశారు. విశ్వహిందూ పరిషత్ సాహిత్యం అందజేశారు. దీంతో నాగబాబుగారు స్పందిస్తూ.. "కాషాయం కండువా చాలా పవిత్రమైనదని.. ఎంతో విలువైనదని.. దీనిని జాగ్రత్తగా ఉంచుకోవాలి" అని అభిప్రాయపడ్డారు.

🔶️🔸  ️ఉత్తర్ ప్రదేశ్ లో గోవధ నిషేదిస్తూ ఆర్డినెన్సు తెచ్చిన యోగి సర్కార్.....🔶️🔸  ️నేరం రుజువైతే 10 ఏళ్ల జైలు శిక్ష ఉండే...
10/06/2020

🔶️🔸 ️ఉత్తర్ ప్రదేశ్ లో గోవధ నిషేదిస్తూ ఆర్డినెన్సు తెచ్చిన యోగి సర్కార్.....
🔶️🔸 ️నేరం రుజువైతే 10 ఏళ్ల జైలు శిక్ష ఉండేలా కొత్త చట్టం రూపకల్పన.....

⛳ గోమాత - జగన్మాత ⛳
🚩భారత్ మతాకి జై 🚩

Address

Vidyanagar
Bhongir
508116

Telephone

+919247468500

Website

Alerts

Be the first to know and let us send you an email when VhP విశ్వహింధూ పరిషత్ యాదాద్రి భువనగిరి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to VhP విశ్వహింధూ పరిషత్ యాదాద్రి భువనగిరి:

Videos

Share