Times Of Marripadu

Times Of Marripadu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Times Of Marripadu, Digital creator, Atmakuru.
(2)

*ఆంధ్ర విద్యార్థి సంఘం(AVS) రాష్ట్ర అధ్యక్షుడుగా మల్లవరపు అశోక్ రెడ్డి నియామకం ....**నేడు తాడేపల్లి గూడెం లో జరుగుతున్న ...
16/06/2024

*ఆంధ్ర విద్యార్థి సంఘం(AVS) రాష్ట్ర అధ్యక్షుడుగా మల్లవరపు అశోక్ రెడ్డి నియామకం ....*

*నేడు తాడేపల్లి గూడెం లో జరుగుతున్న ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం లో రాష్ట్ర అధ్యక్షుడి గా మల్లవరపు అశోక్ రెడ్డి ని రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు...*

సన్ను వారి పల్లిలో శ్రీరామనవమి ఉత్సవాలు
10/05/2024

సన్ను వారి పల్లిలో శ్రీరామనవమి ఉత్సవాలు

29/04/2024

ఎమ్మెల్యే మేకపాటి సొంత గ్రామం బ్రాహ్మణపల్లి లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టిడిపి ఎంపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం

మర్రిపాడు మండలం డిసిపల్లి నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తి అరెస్ట్..అతని వద్ద నుండి 25 మద్యం బాటిళ్లు స్వాధీనం...
22/04/2024

మర్రిపాడు మండలం డిసిపల్లి నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తి అరెస్ట్..అతని వద్ద నుండి 25 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

*మర్రిపాడు మండలంలో పదవ తరగతి ఫలితాలలో 87 శాతం ఉత్తీర్ణత*మర్రిపాడు మండలంలోని 12 ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షకు హాజరైన ...
22/04/2024

*మర్రిపాడు మండలంలో పదవ తరగతి ఫలితాలలో 87 శాతం ఉత్తీర్ణత*

మర్రిపాడు మండలంలోని 12 ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షకు హాజరైన 374 మంది విద్యార్థులకు గాను 326 మంది ఉత్తీర్లైనారు.87 శాతం ఉత్తీర్ణత లభించింది.బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాల నందు 14 మందికి గాను 14 మంది ఉత్తీర్ణులై నూరు శాతం ఉత్తీర్ణత సాధించింది.చుంచులూరు ఉన్నత పాఠశాలలో 31 మందికి గాను 25 మంది,కదిరినాయుడు పల్లి ఉన్నత పాఠశాలలో 18 మంది గాను 16 మంది,మర్రిపాడు ఉన్నత పాఠశాలలో 62 మందికి గాను 48 మంది,చిలకపాడు ఉన్నత పాఠశాలలో 15 మంది గాను 14 మంది,పొంగూరు ఉన్నత పాఠశాలలో 15 మంది గాను 14 మంది,పోలిరెడ్డి పల్లి ఉన్నత పాఠశాలలో 34 మందికి గాని 28 మంది,టీ.ఎన్.పేట ఉన్నత పాఠశాలలో 25 మందికి గాను 22 మంది,నందవరం ఉన్నత పాఠశాలలో 30 మందికి గాను 28 మంది,కంపసముద్రం ఉన్నత పాఠశాలలో 19 మంది గాను 13 మంది,కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 39 మంది గాను 36 మంది,ఏపీ మోడల్ స్కూల్ నందవరం నందు 72 మంది గాను 68 మంది ఉత్తరలైనారు.ఏపీ మోడల్ స్కూల్,నందవరం కు చెందిన మనోజ్ 577 మార్కులతో మండలంలో మొదటి స్థానం సాధించాడు.పొలిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన చందన 566 మార్కులతో ద్వితీయ స్థానం,నందవరం ఉన్నత పాఠశాలకు చెందిన తస్లీమా కౌసర్ 564 మార్కులతో తృతీయ స్థానం,ఏపీ మోడల్ స్కూల్ కు చెందిన వెంకట ముఖేష్ 563 మార్కులతో నాలుగో స్థానం,చుంచులూరు ఉన్నత పాఠశాల చెందిన జ్ఞాపిక 561 మార్కులతో ఐదవ స్థానం సాధించారు.ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మర్రిపాడు మండల విద్యాశాఖ అధికారులు నజీర్ భాష,ధనలక్ష్మి,ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.

*జవహర్ నవోదయ విద్యాలయం లో జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవము*జవహర్ నవోదయ విద్యాలయం క్రిష్ణాపురం నందు జిల్లాస్థాయి ప్రేరణ ఉత్సవ...
19/04/2024

*జవహర్ నవోదయ విద్యాలయం లో జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవము*

జవహర్ నవోదయ విద్యాలయం క్రిష్ణాపురం నందు జిల్లాస్థాయి ప్రేరణ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.మండల స్థాయి లో వ్యాస రచన,పద్య పఠనం,చిత్ర లేఖనం,కథలు,పాటలు తదితర అంశాలలో విజేతలుగా నిలిచిన విద్యార్ధినీ విద్యార్ధులకు నేడు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించారు.ఈ పోటీలలో జిల్లాలోని అన్ని మండలాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు.వీరిలో 15 మంది బాలికలు,15 మంది బాలురు ను మొదటి రౌండ్ కు ఎంపిక చేశారు.వీరికి ఇంటర్వ్యూ లు నిర్వహించి రాష్ట్ర స్థాయికి ఇద్దరిని ఎంపిక చేస్తారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉషా రాణి,ప్రేరణ కార్యక్రమ రాష్ట్ర పరిశీలకులు శారదా కుమారి,అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుధీర్ బాబు,జవహర్ నవోదయ విద్యాలయ ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి జడ్జిలుగా బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవరావు,జవహర్ నవోదయ విద్యాలయ సీనియర్ లెక్చరర్ రాజశేఖర్,ఉపాధ్యాయులు శంకర్,రాజేంద్రకుమార్,మంజుల,భాగ్యలక్ష్మి,జవహర్ నవోదయ విద్యాలయ సిబ్బంది,విద్యార్థులు,గైడ్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

*రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు...*☘️🌙🍁🌙☘️🌙🍁🌙☘️
11/04/2024

*రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు...*
☘️🌙🍁🌙☘️🌙🍁🌙☘️

దర్శనమిచ్చిన నెలవంక దేశవ్యాప్తంగా రేపే రంజాన్ వేడుకలుముస్లిం సోదరుల 30 రోజుల కఠిన ఉపవాసాలు అనంతరం బుధవారం నెలవంక దర్శనం ...
10/04/2024

దర్శనమిచ్చిన నెలవంక దేశవ్యాప్తంగా రేపే రంజాన్ వేడుకలు

ముస్లిం సోదరుల 30 రోజుల కఠిన ఉపవాసాలు అనంతరం బుధవారం నెలవంక దర్శనం ఇవ్వడంతో రంజాన్ వేడుకలు ప్రారంభమయ్యాయి.ఒకరికి ఒకరు ముస్లిం సోదరులు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.

మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
09/04/2024

మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు

ముస్లీం సోదరులకు స్వీట్లు పంపిణీ చేసిన సుబ్బారెడ్డిపవిత్రమైన రంజాన్ మాసంలో షాబ్ _ఏ__బారాత్ పర్వదినాన్ని పురస్కరించుకుని ...
06/04/2024

ముస్లీం సోదరులకు స్వీట్లు పంపిణీ చేసిన సుబ్బారెడ్డి

పవిత్రమైన రంజాన్ మాసంలో షాబ్ _ఏ__బారాత్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రార్థనలు చేస్తున్న చుంచులూరు గ్రామానికి చెందిన ముస్లీం సోదరులకు మురుకూటి సుబ్బారెడ్డి స్వీట్లు పంపిణీ చేశారు.మస్జిద్ కి దీపాలంకరణ చేయించారు.ముస్లిం సోదరుల పట్ల సుబ్బారెడ్డి చూపిన అభిమానానికి వారు ధన్యవాదాలు తెలియచేసారు.

రంజాన్ మాసం సందర్భంగా చుంచులూరు గ్రామంలోని ముస్లీం సోదరులకు ఇందూరు నరసారెడ్డి,ఇందూరు విష్ణుకుమార్ రెడ్డి ల ఆధ్వర్యంలో  ఇ...
05/04/2024

రంజాన్ మాసం సందర్భంగా చుంచులూరు గ్రామంలోని ముస్లీం సోదరులకు ఇందూరు నరసారెడ్డి,ఇందూరు విష్ణుకుమార్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు.


నెల్లూరు జిల్లా ఎస్పీ గా ఆరిఫ్ హఫీజ్ నియామకం
04/04/2024

నెల్లూరు జిల్లా ఎస్పీ గా ఆరిఫ్ హఫీజ్ నియామకం

మర్రిపాడు మండలం కృష్ణాపురం నవోదయ స్కూల్లో  ఆరవ తరగతిలో సీటు సాధించిన తిక్కవరం ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థిని చండ్ర  ...
03/04/2024

మర్రిపాడు మండలం కృష్ణాపురం నవోదయ స్కూల్లో ఆరవ తరగతిలో సీటు సాధించిన తిక్కవరం ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థిని చండ్ర నందన

ఆత్మకూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా చెవూరు శ్రీధర్ రెడ్డి గారిని ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం
02/04/2024

ఆత్మకూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా చెవూరు శ్రీధర్ రెడ్డి గారిని ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం

*తిక్కవరం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు నవోదయకు ఎంపిక*తిక్కవరం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు కొప్పోలు.కెల్విన్,బ...
02/04/2024

*తిక్కవరం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు నవోదయకు ఎంపిక*

తిక్కవరం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు కొప్పోలు.కెల్విన్,బోయపాటి.నాగ వర్షిత్ లు నవోదయ ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచి జవహర్ నవోదయ విద్యాలయం,కృష్ణాపురం నందు సీట్లు సంపాదించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రతిభ కనపరిచి నవోదయకు ఎంపికైన విద్యార్థులను మర్రిపాడు మండల విద్యాశాఖాధికారులు నజీర్ భాష,ధనలక్ష్మి,పాఠశాల ఉపాధ్యాయులు పద్మ,శారద,నాని బీబీ,గ్రామస్తులు తదితరులు అభినందించారు.

*మేకపాటి దంపతులతో బొల్లినేని భేటీ.....**ఉదయగిరి నియోజకవర్గంలోని పలు విషయాల పై చర్చా...**మర్రిపాడులో ఉన్నటువంటి  ఉదయగిరి ...
30/03/2024

*మేకపాటి దంపతులతో బొల్లినేని భేటీ.....*

*ఉదయగిరి నియోజకవర్గంలోని పలు విషయాల పై చర్చా...*

*మర్రిపాడులో ఉన్నటువంటి ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్వగృహం నందు ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు బొల్లినేని రామారావు మేకపాటి దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరియు వారి సతీమణి టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకపాటి శాంతి కుమారి బొల్లినేనికి ఆత్మీయ స్వాగతం పలికారు. భోజనం అనంతరం ఇరువురు పలు విషయాలపై చర్చించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో తూనికలు కొలతల అధికారులకు ఫిర్యాదు చేయాలంటే, వివిధ జిల్లాల అధికారుల మొబైల్ నెంబర్స్.
29/03/2024

ఆంధ్రప్రదేశ్ లో తూనికలు కొలతల అధికారులకు ఫిర్యాదు చేయాలంటే, వివిధ జిల్లాల అధికారుల మొబైల్ నెంబర్స్.

28/03/2024

మర్రిపాడు మండలం నందవరం లో పలుచోట్ల వెలగని వీధి దీపాలు.. ధ్వంసమైన సిసి రోడ్లు అంటగా 😳

నెల్లూరు...- ఏ ఎస్ పేటలో లోని ఖాజా నాయబ్ రసూల్ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన నెల్లూరు యం పి అభ్యర్థి వేమిరెడ్డ...
28/03/2024

నెల్లూరు...

- ఏ ఎస్ పేటలో లోని ఖాజా నాయబ్ రసూల్ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన నెల్లూరు యం పి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీమంత్రి ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్ది.

- దర్గా సెంటర్ నుండి ప్రజాగళం సభ ప్రాంగణం వరకు భారీ ర్యాలీతో కిక్కిరిసిన రోడ్డులు

- అనంతరం ప్రజలగళం సభలో పాల్లోన్న వేమిరెడ్డి, ఆనం, రంగమయూర్ రెడ్డి , కైవల్య రెడ్డి.

- యం పి గా తనను, ఎమ్మెల్యే గా ఆనం ను సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించిన - వేమిరెడ్డి

27/03/2024
నెల్లూరు...- మర్రిపాడులోని సోమల వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు అనే రైతులకు చెందిన పొగాకు బ్యార్నిలో అగ్ని ప్రమాదం. - 1,50,0...
27/03/2024

నెల్లూరు...

- మర్రిపాడులోని సోమల వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు అనే రైతులకు చెందిన పొగాకు బ్యార్నిలో అగ్ని ప్రమాదం.

- 1,50,000 రూపాయల విలువ చేసే పొగాకు దగ్ధం.

- పొగాకు బ్యార్నిలో మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది.

నెల్లూరు...- మర్రిపాడు మండలం డిసిపల్లి గ్రామంలో బైకు దొంగల హల్చల్.- ఇంటి బయట నిలిపి ఉన్న చిలక వెంగయ్య అనే వ్యక్తికి చెంద...
27/03/2024

నెల్లూరు...

- మర్రిపాడు మండలం డిసిపల్లి గ్రామంలో బైకు దొంగల హల్చల్.

- ఇంటి బయట నిలిపి ఉన్న చిలక వెంగయ్య అనే వ్యక్తికి చెందిన బైకును (AP 26 BA 4598) ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దొంగలు.

- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు.

*ఇంటింటి ప్రచారానికీ అనుమతి తప్పనిసరి: సీఈవో*AP: సార్వత్రిక ఎన్నికల్లో సభలు, రోడ్లతోపాటు ఇంటింటి ప్రచారానికీ అభ్యర్థులు ...
27/03/2024

*ఇంటింటి ప్రచారానికీ అనుమతి తప్పనిసరి: సీఈవో*

AP: సార్వత్రిక ఎన్నికల్లో సభలు, రోడ్లతోపాటు ఇంటింటి ప్రచారానికీ అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలని CEO ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సమావేశానికి 48 గంటల ముందు సువిధ యాప్ లేదా నేరుగా రిటర్నింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలంటూ పార్టీలకు లేఖ రాశారు. ప్రచార సామగ్రి అనుమతులు సీఈవో వద్ద, ఊరేగింపులు, ర్యాలీలకు జిల్లాల ఎన్నికల అధికారుల వద్ద అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఈ ఫోటోలలో ఉన్న ఇద్దరు వ్యక్తులు నలుపు మరియు ఎరుపు పల్సర్ బైక్ పై తిరుగుతూ దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. , న...
26/03/2024

ఈ ఫోటోలలో ఉన్న ఇద్దరు వ్యక్తులు నలుపు మరియు ఎరుపు పల్సర్ బైక్ పై తిరుగుతూ దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. , నకిలీ నెంబర్ ప్లేట్ వాడుతూ, హెల్మెట్లు పెట్టుకుని మరియు మొహానికి మాస్కులు ,టోపీలు పెట్టుకుంటూ, కాళ్లకు షూ వేసుకుని కందుకూరు పట్టణంలో అర్ద రాత్రి మరియు ,ఉదయం సమయాలలో మనుషులు ఉన్న ఇళ్లలోనికి ప్రవేశించి కొడవలి, కత్తి ఇతర ఆయుధాలు చూపించి బెదిరించి డబ్బులు దోపిడీ చేసిన కేసులలో నిందితులుగా ఉన్నారు. వీళ్ళ ఆచూకీ తెలిస్తే మీ ఏరియా లో చూసేదానికి అలాంటి ఆకారం కలిగిన, చెడు అలవాట్లు కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే పోలీస్ వారికి సమాచారం ఇచ్చి వారిని గుర్తించటానికి సహాయం చేసిన వారికి తగిన పారితోషికం ఇస్తామని ప్రకటించారు. SI ఉలవపాడు 9121102205,SI కందుకూరు 9121102203,CI కందుకూరు 9121102202..

నెల్లూరు... - మర్రిపాడు మండలం చుంచులూరు సమీపంలో  జాతీయ రహదారి పై గుర్తుతెలియని వాహనం ఢీకొని.. గుర్తుతెలియని ఓ యువకుడు మృ...
25/03/2024

నెల్లూరు...

- మర్రిపాడు మండలం చుంచులూరు సమీపంలో జాతీయ రహదారి పై గుర్తుతెలియని వాహనం ఢీకొని.. గుర్తుతెలియని ఓ యువకుడు మృతి.

*🌱పొగాకు రైతులకు విజ్ఞప్తి🌱*🌱2 వ నెంబర్ పొగాకు లొ గట్టి మరియు నల్ల మాడు లేని, మంచి రంగు ఉన్న పొగాకును మాత్రమే కొంటున్నార...
24/03/2024

*🌱పొగాకు రైతులకు విజ్ఞప్తి🌱*

🌱2 వ నెంబర్ పొగాకు లొ గట్టి మరియు నల్ల మాడు లేని, మంచి రంగు ఉన్న పొగాకును మాత్రమే కొంటున్నారు.నల్ల బొగ్గులు మరియు అడుగాకులు ఉన్న 2 వ నెంబరు పొగాకు కొనటం లేదు.కావున అటువంటి పొగాకును తీసుకొని రావద్దు.

🌱 వేలం కేంద్రంలొకి ఇప్పుడు అమ్ముడుపోయే పొగాకు బేళ్ళను మీ క్లస్టర్స్ ముందు రోజు వచ్చి ఎ ధర కు పోతుందో చూసుకొని పొగాకు బెల్లు తీసుకు రావాల్సిందిగ కోరుచున్నాము.

ఇట్లు

*జి. రాజశేఖర్*
వేలం నిర్వహణ అధికారి
డి. సి. పల్లి

Address

Atmakuru

Website

Alerts

Be the first to know and let us send you an email when Times Of Marripadu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other Atmakuru media companies

Show All