Hello Anantapur

Hello Anantapur anantapur updates anantapur news

సోమవారం ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం....
28/05/2023

సోమవారం ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం....

క్రింది స్థాయి సిబ్బందితో పని చేయించే శక్తి ఉన్న మంచి పని కోసం ముందుండి మీ కేడర్ను పక్కనపెట్టి సహాయం చేస్తున్న డి.ఎస్.పి...
06/10/2022

క్రింది స్థాయి సిబ్బందితో పని చేయించే శక్తి ఉన్న మంచి పని కోసం ముందుండి మీ కేడర్ను పక్కనపెట్టి సహాయం చేస్తున్న డి.ఎస్.పి శ్రీనివాసులు సార్ గారికి మరియు పోలీసు వారికి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

26/09/2022
21/09/2022

అనంతపురం హైవే హైదరాబాద్ చెఫ్ రెస్టారెంట్ నందు ఐచర్ ఇతర వాహనం డివైడర్ పై ఉన్న దృశ్యం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు

అనంతపురంలో రెండు సంవత్సరాలుగా వింత జీవితం గడుపుతున్న ఓ కుటుంబంలో పోలీసుల మానవత్వం వెలుగులు నింపింది * అమ్మ, నాన్న చనిపోవ...
17/09/2022

అనంతపురంలో రెండు సంవత్సరాలుగా వింత జీవితం గడుపుతున్న ఓ కుటుంబంలో పోలీసుల మానవత్వం వెలుగులు నింపింది

* అమ్మ, నాన్న చనిపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లి ఇంటికే పరిమితమైన ముగ్గురు కుటుంబ సభ్యులకు విముక్తి కల్పించారు

* బూజు పట్టిన ఇల్లు .. జడలు కట్టిన జుట్టుతో దుర్గంధం వెదజల్లుతూ శ్మశాన వాటికను తలపిస్తోన్న వాతావరణం నుండీ జన జీవనంలోకి తెచ్చిన అనంతపురం పోలీసులు

** వివరాలు...

అనంతపురం నగరం వేణుగోపాల్ నగర్ ఆటో స్టాండ్ సమీపాన ఉన్న ఓ ఇంట్లో ముగ్గురు సభ్యులున్న కుటుంబం గత రెండేళ్లుగా బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఇంట్లోనే మగ్గుతున్నారు. వీరి తండ్రి మూడేళ్ల కిందట చనిపోవడంతో ఈ ముగ్గురూ డిప్రెషన్ లోకి వెళ్లారు. అప్పటి నుండీ ఆ ఇళ్లు తలుపులు వేసినవి వేసినట్లే ఉంటున్నాయి. బిల్లు చెల్లించక పోవడంతో కరెంటు సైతం కట్ చేశారు. అవేమీ పట్టించుకోకుండా అంధకారంలోనే జీవిస్తున్నారు. జుట్టు పెరిగి జడలుగా అట్టకట్టాయి. గోర్లు విపరీతంగా పెరిగాయి. స్నానం లేదు. ఇళ్లంతా దుర్గంధం. లోపల శ్మశాన వాతావరణం తలపిస్తోంది ఈక్రమంలో విపరీతమైన దుర్గంధం బయటికి వెదజల్లడంతో స్థానికులు గమనించారు. ఈవిషయం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి దృష్టికి వచ్చింది. అనంతపురం ఇన్ఛార్జి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రవి శంకర్ రెడ్డి, సిబ్బంది, మరియు స్థానిక కార్పొరేటర్ సుజాత, స్థానికులు సంయుక్తంగా ఆ ఇంటిని ఈరోజు సందర్శించారు. ఇరుగు పొరుగు వారి సహాయముతో మానసిక ఒత్తిడిలో ఉన్న వారికి కౌన్సిలింగ్ చేశారు. తరువాత వారిని ఒప్పించి వారికి స్నానాలు చేయించారు. కొత్త దుస్తులు మరియు నిత్యావసర వస్తువులను ఇప్పించి వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చారు. పోలీసుల మానవత్వం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.



అనంతపురం లోని వేణుగోపాల్ నగర్ లో ఒక ఇంట్లో అన్నాచెలిళ్ళు తమ తల్లి మరణంతో డిప్రెషన్ కి గురైయ్యారు దితో గత  మూడు సంవత్సరాల...
17/09/2022

అనంతపురం లోని వేణుగోపాల్ నగర్ లో ఒక ఇంట్లో అన్నాచెలిళ్ళు తమ తల్లి మరణంతో డిప్రెషన్ కి గురైయ్యారు దితో గత మూడు సంవత్సరాలుగా వారి ఇంట్లోనే దిగ్బంధం చేసుకున్నారు . కరెంటు నీరు ఆహారం లేకుండా జీవనం సాగిస్తున్నారు అప్పుడప్పుడు అన్న తెచ్చిన ఆహారం తింటూనే జీవనం సాగిస్తున్నారు అలా తెచ్చుకున్న ప్యాకెట్లు వారి గదిలోనే చెత్తకుప్పల వేసుకోవడం వలన దుర్వాసన రావడం తో స్థానికులు పోలీస్ వారికి సమాచారం ఇచ్చారు దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది

💯 no. 7️⃣1️⃣st for 𝐕𝐢𝐫𝐚𝐭 𝐊𝐨𝐡𝐥𝐢!!!       .kohli
08/09/2022

💯 no. 7️⃣1️⃣st for 𝐕𝐢𝐫𝐚𝐭 𝐊𝐨𝐡𝐥𝐢!!!

.kohli

మెరుగైన సమాజం కోసం  #సాక్షి విలేకరి సమర్పించు డీల్
25/08/2022

మెరుగైన సమాజం కోసం #సాక్షి విలేకరి సమర్పించు డీల్

ఇది అనంతపురంలోని ఏ డ్రైనేజ్ కాదు .ఇది మనము త్రాగుతున్న నీళ్ళు ఫిల్టర్ చేసే ఫిల్టరేషన్ పాయింట్ దగ్గర ప్రొఖ్యులేటర్ . ఇంత ...
24/08/2022

ఇది అనంతపురంలోని ఏ డ్రైనేజ్ కాదు .ఇది మనము త్రాగుతున్న నీళ్ళు ఫిల్టర్ చేసే ఫిల్టరేషన్ పాయింట్ దగ్గర ప్రొఖ్యులేటర్ .

ఇంత బురద( ఆలం పేరుకు పోయి ) మట్టి ,చెత్త ,విషంతో నిండి పోయిన ఈ ఫైల్టరేషన్ పాయింట్ చూసి చూడనట్టు ఉండడమే కాకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడం వేరే ఎత్తు.

శుభ్రం చేసి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో? కానీ ప్రతి ఏటా లక్షలు దీని క్లీనింగ్ కోసం అని లెక్కలు చూపించారు

ప్రజలు 10 రోజులనుంచి ఈ విషపు నీరు ,బురద నీరు తాగుతున్నారు .అయ్యా దరిద్రంగా ఉన్నాయి నీళ్ళు అని నెత్తి నోరు మోతుకున్నా , మన AMC ప్రబుద్ధులు మాత్రం " అపోహలు నమ్మొద్దు స్వఛ్చమైన నీరు అందిస్తున్నాము అని " నాలుగు లక్షల మంది అనంత వాసులను తప్పుదోవ పట్టించిన వారిని ఏమనాలి ?

పసి పిల్లల ప్రాణాలతో , ఆరోగ్యంతో , మన తల్లి తండ్రుల ఆరోగ్యం తో ఆడుకున్న వారిని ఏమనాలి , ఏమి చేయాలి

ఈ దరిద్రం అంతా ఇప్పటికైనా రంగంలోకి దిగి క్లీన్ చేయిస్తున్న కొంత మంది ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు .

మరో 24 గంటల్లో మనకు మంచి నీరు వచ్చే ప్రయత్నం జరుగుతున్నది

!!! అనంత నగర పాలక సంస్థ ద్వారా సరఫరా అవుతున్న నీరు శుద్ధమైన మంచినీరు అని సంబంధిత అధికారి మొండి వాదన...ప్రజలు ::: మీ ఇంట్...
23/08/2022

!!! అనంత నగర పాలక సంస్థ ద్వారా సరఫరా అవుతున్న నీరు శుద్ధమైన మంచినీరు అని సంబంధిత అధికారి మొండి వాదన...

ప్రజలు ::: మీ ఇంట్లో నీరు ఎలా ఉందో ఆయనకు sample పంపండి లేదా ఇక్కడ ఫోటో తీసి పెట్టండి...

!!! అనంతపురం నగరంలో PABR నుంచి సరఫరా అయ్యే నీరు చాలా ఎర్రగా ఉన్నాయి. మొహం కడుక్కోవడానికి ,స్నానం చేయడానికి కూడా పనికి రాకుండా ఉన్నాయి...

!!! దయచేసి అనంతపురం నగర పాలక ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు ఎర్రటి మంచినీటిపై దృష్టి సాధించి ,త్వరగా సమస్యకు పరిస్కారం చూపాలని నగర వాసులు కోరుతున్నారు...

!!! ఈ ఎర్రటి నీరు వల్ల చిన్నపిల్లల కు ,వయో వృద్ధులకు దగ్గు, జలుబు గొంతు నొప్పి వస్తున్నాయి...కనీసం ఇప్పటికైనా స్పందించండి ...

ఈ  అబ్బాయి కి D mart ముందర  హైవే పైన accident జరిగింది. Saveera   హాస్పిటల్  నందు అడ్మిట్ లో ఉన్నాడు. ప్రస్తుతం కొమా లో ...
13/08/2022

ఈ అబ్బాయి కి D mart ముందర హైవే పైన accident జరిగింది. Saveera హాస్పిటల్ నందు అడ్మిట్ లో ఉన్నాడు. ప్రస్తుతం కొమా లో ఉన్నాడు. వాళ్ల parents డిటైల్స్ తెలియదు. ఈ అబ్బాయి ని గుర్తు పట్టిన వారు వారి parents కి తెలియజేయాలని కోరుకుంటున్నాము . Traffic police. Anantapur

26/06/2022

😛😛😛😛

Anthega anthega........
06/06/2022

Anthega anthega........

కల చెదిరి పోయే...😭😭😭నేల కూలిన మన లలితకళా పరిషత్తు  ముఖద్వారం.మన అనంతపురం అణిముత్యం మన లలిత కళా పరిషత్తు.సూడప్పా ...మనం ఇ...
02/06/2022

కల చెదిరి పోయే...😭😭😭

నేల కూలిన మన లలితకళా పరిషత్తు ముఖద్వారం.

మన అనంతపురం అణిముత్యం మన లలిత కళా పరిషత్తు.

సూడప్పా ...మనం ఇండ్లల్లో నటిస్తాండాం
జీవితాల్లో నటిస్తాండాం
కానీ ...సమాజం కోసం నటించేదప్పుడు
మనకు ఒక వేదిక కావల్ల కదా
మా అనంతపురానికి సంబంధించినంతవరకూ
అట్లాంటి వేదిక లలితకళా పరిషత్తు ....

ఓ....ఇప్పుడు కట్టిందా ఏమన్నా
నేను 1954 లో పుట్టకముందే పుట్టింది
పాతూరికి కొత్తూరికి మధ్యలో
వంతెనలా కట్టినారప్పా ...
మా ఊరి గ్రంథాలయాన్ని ఆనుకొని
వుంటుంది
అప్పట్లో కట్టినోళ్ళు శానా ఆలోచించి కట్న్యారేమో
గ్రంథాలయంలో సదువుకున్నదంతా
కళా రూపంలోకి రావల్లనుకొని కట్టినారేమో ...

తూర్పు ముఖంగా అర్ద చంద్రాకారంగా
ఒక పెద్ద వేదిక కట్టి , దానిని ఆనుకొని
కుడిపక్కా ఎడమపక్కా
రెండు రెండు మేకప్ గదులు కట్టి
వేదిక ముందు కింద డ్రామా లాడేటప్పుడు
హార్మనిస్టు, తపలా వాళ్ళు , ఫొకస్ లైట్లోల్లు
కూసునేకి స్థలమిడిసి కట్టినారు ...
స్టేజి ముందంతా మైదానమే
అయిదారు వందలమంది కూసొని సూడొచ్చు ...

మా అనంతపురంలోని కళాకారులకు
లలితకళా పరిషత్తు తల్లి దిక్కున్నట్ల
ఆంద్రదేశంలో పేరుమోసిన
కళాకారులందరూ ఆడ నాటకాలాడినోళ్ళే ....

స్వాతంత్ర్యం రాకముందు
సీమ సారథులయిన
కల్లూరు సుబ్బారావు, పైడి లక్ష్మయ్య
రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ అందరూ
ఆడనే కూసోని మాట్లాడుకుంటాండ్ర్యంట
వాళ్ళ స్పర్శా ప్రభావమేమో
లలితకళా పరిషత్తు కళాపొగ ఎగిరింది
ఆ సుగంధ పొగ రెండు మూడు తరాలవాళ్ళు
పీల్చి ధన్యులయిపొయినారు ...

ప్రతి సంవత్సరమూ
బొందుపోకుండా డ్రామాలాడుతాండ్రి
అనంతపురానికి వర్షాలు వచ్చినా రాకపోయినా
సర్కారోళ్ళు వచ్చి నాటకాలాడుతాండ్రి
ఈలపాట రఘరామయ్య,బి.ఎ.సుబ్బారావు
పీసుపాటి, షణ్ముఖ ఆంజనేయ రాజు
ఇంకా పేరుమోసిన కళాకారులు వచ్చి
కళా పిపాసను ఎగదోసి పోయేవాళ్ళు ...

ఇంకా ...సినిమా నటుడు.నాగభూషణం
రక్త కన్నీరు డ్రామా ప్రతి సంవత్సరం ఆడేవాడు
ఆయప్ప పలికే డైలాగులకు
ఏసే పంచ్ లకు జనం ఇరగబడి పోతాండ్రి ...

పల్లెల్లో శెనిక్కాయలు పీకే కాలం అయిపోతానే
కురుక్షేత్రం డ్రామా ఏస్తాండ్రి సర్కారోళ్ళు
పల్లెలోల్లంతా బండ్లు కట్టుకొని వస్తాండ్రి సూసేకి
మా పల్లెలనిండా రాగాలు పుట్టుకొస్తాండ్య...

అంతెందుకప్పా ...మానాయన ఉజ్జన్న అయివారు
ఆయనకూడా లలితకళా పరిషత్తులో నాటకాలాడినోడే
శ్రీ కృష్ణార్జున యుధ్ధంలో అర్జునుడిగా
గయోపాఖ్యానంలో గయుడుగా వేసినోడే
సీతారామమ్మ కృష్ణునిగా వేశం వేసిండ్య
బావా !...అని కృష్ణుడు అర్జునుని చెయ్యి పట్టుకున్నప్పుడల్లా ..
ఈయప్ప ఎనకంజేస్తాండ్య ..
నా సిన్నప్పుడంతా ఈ ముచ్చట నవ్వుకుంటా చెప్పుకుంటాటిమి ...

నేను డిగ్రీ సదివేటప్పుడు
మా నాయన ఈ రోజు డ్రామాకు పోదామప్పా అనె
నేను రానప్పా అంటి ...
లేదు లేదు రావల్సిందేనని పట్టకపాయె
ఆ డ్రామా పేరు తుళసీ జలంధర
జలంధరుడుగా ఆచంట వెంకట రత్నం నాయుడు వేసె
ఆ డ్రామా సూస్తాంటే
నాటకమంటే ఎట్లుండల్లో
అది నటించడమంటే ఎట్లో తెలిసె
ఆచంట వెంకట రత్నం నాయుడు
అప్పటికే ఆంద్ర దేశం మెచ్చిన నటుడు ...
నటనంటే ఇట్లా వుంటుందా
ఆ కళను తపస్సుగా చేసుకొంటే
ఇట్లా నటిస్తారా అనిపించె...
ఆయన నటనకు ఆజన్మాంతమూ ఋణపడినానప్పా ..

ఇంకా సెప్పల్లంటే...
నా చిన్ననాటి జతగాడు
మల్లెల నరసింహ మూర్తి అన్న
యం.డి. చెన్నకేశవులు
లలిత కళా పరిషత్తులోనే
యండమూరి వీరేంద్రనాథ్ రచించిన
గులాబీ ముళ్ళు గులక రాళ్ళు నాటిక వేసిండ్య
మేమంతా శానా సంతోషంగా సూస్తిమి ...

ఇంతెందుకప్పా ...
1975 లో నేను నా కవి మిత్రులు
మల్లెల, బండి నారాయణ స్వామి
యక్కలూరి శ్రీరాములు, కార్తకేయ శర్మ
లలితకళా పరిషత్తులో జరిగిన
యువ కవి సమ్మెళనంలో పాల్గొంటిమి
అధ్యక్షులుగా కొలకలూరి ఇనాక్ గారుండిరి
ఆహ్వానితులలో సీనియర్ కవులు
పైడి లక్ష్మయ్య, కలచవీడు శ్రీనివాసా చార్యులు
అమ్మళ్ళదిన్నె గోపీనాథ్ మొదలయిన వారుండ్రి అప్పట్లో మా యువకవి సమ్మేళనం సంచలనం కలిగించె

అదీగాక పెద్ద పెద్ధ కళాకారులందరికీ
సినిమా నటీ నటులకు ,సాహిత్యరంగంలోని వాళ్ళకు
సిన్నా ..పెద్దా ...అందరికీ
ఆడనే సన్మానాలు జరుగుతాండ్య
లలితకళా పరిషత్తులో సన్మానమంటే
కళాకారుడిగా ముద్ర పడినట్లే సంతోషపడతాండ్రీ ..

ఇంకొక్క మాట సెప్పి ముగిస్తానప్పా ...
లలితకళా పరిషత్తుతో ఏ నాటి అనుబంధమో
మా నాయన ఆడ నాటకాలాడె
నేను కవిసమ్మేళనాలలో పాల్గొంటి ..
సివరకు ..నా పెద్ద కూతురు శాండిల్య
పెండ్లి కూడా 2016 లో లలితకళా పరిషత్తులోనే చేస్తిని

మారుతున్న కాలంతో పాటూ
లలితకళా పరిషత్తూ మారిపోయె

ఈ రోజు ముఖద్వారము చరిత్రలో కలిసి పోయా






27/05/2022

ఒంటరి ప్రయాణాన్ని ఎప్పుడు చీకటి కోరుకుంటుంది🌍🌆🌆🌇🌇🌇🌇🌇🌃🌃

Mimallani adigara...
21/05/2022

Mimallani adigara...

Address

Anantapur
515001

Website

Alerts

Be the first to know and let us send you an email when Hello Anantapur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hello Anantapur:

Videos

Share