ℝ𝕊 ℕ𝔸𝕀𝔻𝕌

ℝ𝕊 ℕ𝔸𝕀𝔻𝕌 Chief Editor, M.D. / Publisher for "ℙℝ𝔸𝔾𝔸𝕋ℍ𝕀 𝕊𝔸ℕℂℍ𝔸𝕃𝔸ℕ𝔸𝕄"
(1)

మహాలక్ష్మీ స్కీం...పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులల్లో మహిళలకు రేపటి నుండి ఉచిత ప్రయాణం...🚍
08/12/2023

మహాలక్ష్మీ స్కీం...పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులల్లో మహిళలకు రేపటి నుండి ఉచిత ప్రయాణం...🚍

 #ఇల్లు కట్టుకోవాలనే కోరిక, ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అనేక కారణాల చేత సొంత ఇంటి కల కుదరక పోవచ్చు. #సొంత ఇల్లు ఒక్కటే ...
06/12/2023

#ఇల్లు కట్టుకోవాలనే కోరిక, ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అనేక కారణాల చేత సొంత ఇంటి కల కుదరక పోవచ్చు. #సొంత ఇల్లు ఒక్కటే కాదు, స్థలాలు,భూములు,ఇళ్ళు కొనాలన్నా, అమ్మాలన్నా అడ్డంకులు తొలగడానికి ప్రతి రోజు పూజలో భాగంగా ఈ స్తోత్రంని కూడా చేర్చుకోని, ఈ స్తోత్రమును రోజూ 9సార్లు మండలం రోజులు పఠించాలి.

#శ్రీ భూ వరాహ స్తోత్రం
ఋషయ ఊచు |
జితం జితం తేఽజిత యజ్ఞభావనా
త్రయీం తనూం స్వాం పరిధున్వతే నమః |
యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః
తస్మై నమః కారణసూకరాయ తే || ౧ ||

#రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం
దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం |
ఛన్దాంసి యస్య త్వచి బర్హిరోమ-
స్స్వాజ్యం దృశి త్వంఘ్రిషు చాతుర్హోత్రమ్ || ౨ ||

#స్రుక్తుండ ఆసీత్స్రువ ఈశ నాసయో-
రిడోదరే చమసాః కర్ణరంధ్రే |
ప్రాశిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తు తే
యచ్చర్వణంతే భగవన్నగ్నిహోత్రమ్ || ౩ ||

#దీక్షానుజన్మోపసదః శిరోధరం
త్వం ప్రాయణీయో దయనీయ దంష్ట్రః |
జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః
సభ్యావసథ్యం చితయోఽసవో హి తే || ౪ ||

#సోమస్తు రేతః సవనాన్యవస్థితిః
సంస్థావిభేదాస్తవ దేవ ధాతవః |
సత్రాణి సర్వాణి శరీరసంధి-
స్త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధనః || ౫ ||

#నమో నమస్తేఽఖిలయంత్రదేవతా
ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే |
వైరాగ్య భక్త్యాత్మజయాఽనుభావిత
జ్ఞానాయ విద్యాగురవే నమొ నమః || ౬ ||

#దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయా ధృతా
విరాజతే భూధర భూస్సభూధరా |
యథా వనాన్నిస్సరతో దతా ధృతా
మతంగజేంద్రస్య స పత్రపద్మినీ || ౭ ||

#త్రయీమయం రూపమిదం చ సౌకరం
భూమండలే నాథ తదా ధృతేన తే |
చకాస్తి శృంగోఢఘనేన భూయసా
కులాచలేంద్రస్య యథైవ విభ్రమః || ౮ ||

#సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం
లోకాయ పత్నీమసి మాతరం పితా |
విధేమ చాస్యై నమసా సహ త్వయా
యస్యాం స్వతేజోఽగ్నిమివారణావధాః || ౯ ||

#కః శ్రద్ధధీతాన్యతమస్తవ ప్రభో
రసాం గతాయా భువ ఉద్విబర్హణం |
న విస్మయోఽసౌ త్వయి విశ్వవిస్మయే
యో మాయయేదం ససృజేఽతి విస్మయమ్ || ౧౦ ||

#విధున్వతా వేదమయం నిజం వపు-
ర్జనస్తపః సత్యనివాసినో వయం |
సటాశిఖోద్ధూత శివాంబుబిందుభి-
ర్విమృజ్యమానా భృశమీశ పావితాః || ౧౧ ||

#స వై బత భ్రష్టమతిస్తవైష తే
యః కర్మణాం పారమపారకర్మణః |
యద్యోగమాయా గుణ యోగ మోహితం
విశ్వం సమస్తం భగవన్ విధేహి శమ్ || ౧౨ ||

#ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే శ్రీ వరాహ ప్రాదుర్భావోనామ త్రయోదశోధ్యాయః | సంపూర్ణం.

#సర్వేజనా సుఖినోభావంత్🙏🙏🙏🙏

#ప్రగతి సంచలనం

*వడ్డికాసులవాడు*         లక్ష్మీ పద్మావతీ సమేతుడై శ్రీనివాసుడు  ఆనందనిలయంలో నివసిస్తున్న కాలంలో ఒకనాడు లక్ష్మీ దేవి" స్వ...
05/12/2023

*వడ్డికాసులవాడు*


లక్ష్మీ పద్మావతీ సమేతుడై శ్రీనివాసుడు ఆనందనిలయంలో నివసిస్తున్న కాలంలో ఒకనాడు లక్ష్మీ దేవి
" స్వామీ! కుబేరుని వద్ద పుచ్చుకున్న అప్పుకి వడ్డీ రోజు రోజుకు
పెరిగిపోతున్నది.
మన వద్ద అనంతమైన
సిరి సంపదలున్నాయి. సిరులకు అధిదేవతనైన ఈ లక్ష్మి మీ అర్ధాంగి.కుబేరుడి అప్పు పూర్తిగా తీర్చేయవచ్చును కదా, ఏందుకు జాప్యం చేస్తున్నారు " అని అడిగింది. అందుకు లక్ష్మీపతి చిరునవ్వుతో
" దేవీ, కుబేరుని వద్ద అప్పు తీసుకున్న కారణమే లోకకళ్యాణం కోసం.
కలియుగంలో భూలోకవాసులకు
ధర్మాధర్మ విచక్షణ బోధించడానికి , నాస్తికవాదం ప్రబలకుండా వారిలో ఆధ్యాత్మిక భక్తి చింతనను పెంపొందించడానికి నేను కుబేరుని వద్ద తీసుకున్న అప్పు ఉపయోగపడుతుంది " అని అన్నాడు.

శ్రీనివాసుని సతులిద్దరికీ పతి మాటలు అర్ధం కాలేదు. మరల పురుషోత్తముడే ఇలా అన్నాడు.

కలియుగంలో
నిష్కామ భక్తికి
(ప్రతిఫలం
ఆశించని భక్తి) తావులేదు. మానవులు
తమ తమ కోరికలు నెరవేర్చుకుందుకి మాత్రమే నన్ను ఆశ్రయిస్తారు. తమ వాంఛలు తీర్చుకోవడానికి
ఆలయాలకి వచ్చి మ్రొక్కులు మ్రొక్కి అవి నెరవేరగానే ప్రతిఫలం చెల్లించుకుంటారు. కానుకలు సమర్పించుకుంటారు.
ఈ క్రమంలో మానవుడు భక్తి మార్గాన్ని ఆశ్రయిస్తాడు. ఆవిధంగా
కలియుగంలో దేవుని పట్ల భక్తి నిలిచి
వుంటుంది. మానవులు నన్ను తమ కోరికలు తీర్చే వరాలనొసగే
స్వామిగా, ఆపదమ్రొక్కులవాడిగా నన్ను కొలుస్తారు. వారు నా భక్తులైనా , కాకపోయినా వారిని కాపాడేందుకు నేను
కలియుగాంతము వరకు యీ తిరుమలపై నివసిస్తాను.

" స్వామి!.మీ దయార్ద గుణము మాకు తెలుసు. అనంతమైన
భక్తులను అనుగ్రహిస్తూవుంటే
కుబేరునికి అప్పు ఎలా తీరుతుంది? " అని లక్ష్మీ దేవి ప్రశ్నించినది.

" దేవీ! కలియుగంలో మానవులకి సిరిసంపదలు
ఒక్కటే ముఖ్యంగా కనిపిస్తాయి. అందువలన అనేక పాపాలు చేసి, అక్రమ మార్గాన ధనం చేరుస్తారు. ఆ పాప కర్మల ఫలితంగా ఈ జన్మలోనే కఠోర వ్యాధులతో, ఎడతెగని సమస్యలతో కష్టాలపాలవుతారు.
అప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చి
' గోవిందా! నన్ను రక్షించు" అంటూ నా చరణాలు పట్టుకుంటారు.
వారి కష్టాలు తీరితే కానుకలను సమర్పిస్తామని
మ్రొక్కులు మ్రొక్కుకుంటారు.
నేను వారి పాపాలను ఆ కానుకల మీద ఆవాహన చేసి , నా వద్దకు చేరేటట్టు
చేసుకుంటాను. అన్నాడు స్వామి.
పాపపు మచ్చ పడిన ధనం సత్కార్యాలకు వినియోగించ తగునా ? అని లక్ష్మీదేవి అడిగింది.
" దేవీ దానిలో కూడా
ఒక రహస్యం యిమిడి వున్నది.
పాపులు సమర్పించిన కానుకలను అజ్ఞానముతో ఇహలోక సంపదలు ఆశించి నన్ను ప్రార్ధించే వారికి
అనుగ్రహిస్తాను. పవిత్రమైన ఆశయాలతో నిర్మల మనస్సు గల
భక్తులు సమర్పించే కానుకలలో ఒక భాగం మాత్రమే నేను స్వీకరించి మూడొంతుల భాగం కుబేరునికి అప్పుగా తీరుస్తాను. " అని శ్రీనివాసుడు వివరించాడు.

" సరే , ఇందులో మా కర్తవ్యం ఏమిటి
స్వామీ ? " అని అడిగిన లక్ష్మీదేవితో
' నన్ను నమ్మి నా చెంతకు వచ్చేవారందరికీ వారి మంచిచెడ్డలతో నిమిత్తం లేకుండా వారి కోరికలు తీరేలా అనుగ్రహిస్తూ వుండాలి " అని పలికాడు
భగవంతుడు.
" స్వామి! మీ చిత్తానుసారమే
చేస్తాను. కాని ధనం పెరిగిన కొద్దీ వారు మరింత గర్వమధాంధులుగా, దుర్మార్గాలకు పాలుపడకుండా శిష్ట రక్షణ చేయవలసిన బాధ్యత మీదే "
అని అన్నది శ్రీదేవి.

"ఈ తిరుమల కొండ మీద దానధర్మాలు చేసే వారికి ఒకటికి పదింతలుగా పుణ్యఫలాలు లభిస్తాయి.
ఇక్కడ ఏకాగ్రచిత్తంతో నన్ను పూజించి ధ్యానించే
ఉత్తములకు ముక్తిని కటాక్షిస్తాను. నీవు
అనుగ్రహించే సంపదల వలన దుర్మార్గం పెచ్చు పెరుగుతుందని
నీవు సందేహించవద్దు."
అని భగవంతుడు అన్నాడు.

పద్మ పురాణంలో లక్ష్మీ శ్రీనివాసుల ఈ సంభాషణము
వివరించబడివున్నది. కలియుగ
దైవమైన వేంకటేశ్వరుని అనుగ్రహానికి గల రహస్యాన్ని
యీ విధంగా తెలుపుతున్నది.
ఇందులోని నిగూఢార్ధాన్ని సద్భక్తితో గ్రహించి
తిరుమల దేవుని దర్శించిన వారి జీవితం శోభాయమానం
అవుతుందని
మహాత్ముల ఉవాచ.

#ప్రగతి సంచలనం

వైకుంఠద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు – ధనుర్మాసంలో డిసెంబరు 17 నుండి జనవరి 14 వరకు సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై ...
02/12/2023

వైకుంఠద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు


– ధనుర్మాసంలో డిసెంబరు 17 నుండి జనవరి 14 వరకు సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పఠనం

– డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమల, 2023 డిసెంబరు 01: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

– భక్తులు క్యూలైన్లలో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండడాన్ని నివారించేందుకు టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేస్తున్నాం.

ఆన్‌లైన్‌ దర్శన టికెట్ల వివరాలు

– 2.25 లక్షల రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను నవంబరు 10న ఆన్‌లైన్‌లో విడుదల చేశాం.

– రోజుకు 2000 టికెట్లు చొప్పున శ్రీవాణి దర్శన టికెట్లు, గదుల కోటాను కూడా నవంబరు 10న ఆన్‌లైన్‌లో విడుదల చేశాం.

ఆఫ్‌లైన్‌లో స్లాటెడ్‌ సర్వదర్శనం టోకెన్ల వివరాలు

– తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాలలో 94 కౌంటర్ల ద్వారా డిసెంబరు 22 నుండి మొత్తం 4,23,500 టోకెన్లు మంజూరు చేస్తాం.

– తిరుపతిలోని ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్‌, విష్ణునివాసం కాంప్లెక్స్‌, భూదేవి కాంప్లెక్స్‌, శ్రీ గోవిందరాజస్వామి రెండో సత్రం, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్‌ పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, తిరుమలలో స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహం వద్ద టోకెన్‌ కౌంటర్లు ఏర్పాటుచేస్తాం.

భక్తులకు విజ్ఞప్తి

– దర్శనటోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. దర్శన టికెట్లు లేని భక్తులు తిరుమలకు రావచ్చు గానీ దర్శనానికి అనుమతించబడరు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరడమైనది.

శ్రీవారి ఆలయం

– డిసెంబరు 22 నుండి 24వ తేదీ వరకు, డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేయడమైనది. ఈ సేవలను డిసెంబరు 25 నుండి 30వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుంది.

– డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు సహస్రదీపాలంకార సేవను ఏకాంతంగా నిర్వహిస్తాం.

– వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.

– వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తాం.

– నాదనీరాజనం వేదికపై ఏకాదశి రోజున విష్ణుసహస్రనామ పారాయణం ఉంటుంది. అదేరోజు గీతాజయంతి రావడంతో భగవద్గీతను కూడా అఖండపారాయణం నిర్వహిస్తాం.

కార్తీక మాస ఉత్సవాలు

– తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గల ధ్యానారామంలో నవంబరు 14న ప్రారంభమైన రుద్రాభిషేకం డిసెంబరు 12వ తేదీ వరకు జరుగుతుంది.

అధ్యయనోత్సవాలు

– తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 12వ తేదీ నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ధనుర్మాసం ప్రారంభం

– డిసెంబరు 17 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం కావడంతో ఉదయం సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పఠనం జరుగుతుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీ పెద్దజీయర్ మఠంలో తిరుప్పావై పాశురాల పారాయణం నిర్వహించి భక్తులందరూ పఠించేలా ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తాం.

గీతాజయంతి

– తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో డిసెంబరు 23న గీతాజయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ సందర్భంగా విద్యార్థులకు భగవద్గీత పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేస్తాం.

ప్రణయకలహ మహోత్సవం

– డిసెంబరు 28న తిరుమలలో ప్రణయకలహ మహోత్సవం నిర్వహిస్తాం.

భక్తులకు అందుబాటులో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు

– 2024వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతితోపాటు చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీవారి ఆలయాలు, ముంబయి, న్యూఢిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణమండపాల్లో అందుబాటులో ఉన్నాయి.

కాషన్‌ డిపాజిట్‌ రీఫండ్‌ ట్రాకర్‌

– తిరుమలలో గదులు పొందిన భక్తులు కాషన్‌ డిపాజిట్‌ ప్రస్తుతస్థితిని తెలుసుకునేందుకు టీటీడీ వెబ్‌సైట్‌లో కాషన్‌ డిపాజిట్‌ రీఫండ్‌ ట్రాకర్‌ను పొందుపరిచాము. భక్తులు గది బుక్‌ చేసుకున్న మొబైల్‌ నంబరుతో వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి అకామడేషన్ – బుకింగ్‌ హిస్టరీ – ఆఫ్‌లైన్‌ అకామడేషన్‌ సిడి రీఫండ్‌ ట్రాకర్‌ను క్లిక్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

శుభమస్తు..🤝
సర్వేజనా సుఖినో భవంతు ...🙏

#ప్రగతి సంచలనం

 #ఈ చిత్రం వృత్తాంతం  ఎంత మందికి తెలుసు?దేవాలయాల ముందు ధ్వజస్తంభాలు ఎందుకు ఉంటాయో తెలుసా? #చిత్ర కథ :అశ్వమేధ యాగం సంధర్బ...
29/08/2023

#ఈ చిత్రం వృత్తాంతం ఎంత మందికి తెలుసు?
దేవాలయాల ముందు ధ్వజస్తంభాలు ఎందుకు ఉంటాయో తెలుసా?

#చిత్ర కథ :

అశ్వమేధ యాగం సంధర్బంగా తామ్రధ్వజునితో పోరాడుతున్న అర్జునుడి కథాసారం నుండి ఒక దృశ్యం.....

మణిపుర పాలకుడు, మయూర ధ్వజుడు. వీరు మహా పరాక్రమవంతుడు, గొప్ప దానశీలి. . మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు.

మయూర ధ్వజుడు పాండవుల యాగాశ్వమును బంధిస్తాడు. ఆగ్రహించిన పాండు కుమారులు అర్జునుడు భీముడు సహదేవుడు మయూర ధ్వజనితో యుద్ధానికి దిగుతారు.తనతో యుద్ధం చేసిన నకుల సహదేవ భీమార్జునుల్ని మయూరధ్వజుడు ఓడిస్తాడు. పట్టు వదలని పాండు కుమారులు ఆగ్రహోదగృలై ఉంటారు

తన తమ్ముళ్ళు ఓడిపోయిన విషయం తెలిసిన ధర్మరాజు స్వయంగా మణిపురం వైపు బయలుదేరతాడు. అది గ్రహించిన కృష్ణుడు ధర్మరాజును వారిస్తాడు. మయూరధ్వజుణ్ణి జయించేందుకు ఒక కపటోపాయాన్ని చెబుతాడు.

పన్నాగం ప్రకారం శ్రీకృష్ణుడు, ధర్మరాజులిద్దరూ వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుకుంటారు.. అతిథులను చూసిన మయూరధ్వజుడు వారికి ఆహ్వానం పలికి , దానం ఇవ్వదలచి, ఏమి కావాలో కోరుకో మంటాడు.

అందుకు శ్రీకృష్ణుడు కల్పించుకుంటూ " మహారాజా! మేము తమరి దర్శనార్ధమై బయలుదేరి వస్తుంటే.... అరణ్య మార్గంలో ఒక మృగరాజు దురదృష్టవశాత్తు
ఇతడి కుమారుడిపై దాడి చేసింది. ఈ హఠాత్పరిణామానికి మేము మిక్కిలి చింతిస్తూ.... అన్యం పుణ్యం ఎరుగని బాలుడిని విడిచిపెట్టవలసిందని మృగరాజును ప్రార్థించాము. అప్పుడా మృగరాజు విచిత్రంగా మానవ భాషలో మాట్లాడుతూ.... " ఈ బాలుడు మీకు దక్కాలంటే మణిపుర రాజ్యాధిపతి మయూరధ్వజుని శరీరంలో సగభాగం నాకు ఆహారంగా ఇప్పించండి " అని కోరుకుంది . దానకర్ణులైన ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరమున సగభాగం దానమిచ్చిన యెడల ఆ పసి బాలుడిని .... భవిష్యత్తు ఉన్న బాలుడిని కాపాడుకున్న వారిని అవుతాము... " అని హృద్యంగా చెప్పుకుపోయాడు .

ఆ మాటలు విని మయూరధ్వజుడు ఏ మాత్రం వెనక ముందు ఆలోచించనివాడై తన శరీరాన్ని బాలుడి ప్రాణాల్ని రక్షించడం కోసం దానం ఇచ్చేందుకు ఒప్పుకుంటాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు... " తమరి భార్యాపుత్రులే మీ శరీరాన్ని స్వయంగా కోసి ఇవ్వాల్సింది " అనే నియమాన్ని కూడా విధిస్తాడు. అందుకు కూడా మయూరి ధ్వజుడు వెనకడుగు వేయకుండా, అతిథిదేవోభవ అని గౌరవిస్తూ, తన శరీరాన్ని తన భార్య సుతులే స్వయంగా ఖండించేందుకు తగిన ఏర్పాట్లు చేయించి, భార్యాసుతుల్ని రప్పించి , త్యాగానికి సిద్ధమై కూర్చుంటాడు . మయూరధ్వజుడి భార్య పిల్లలు గుండె నిబ్బరం చేసుకుని ఆదేశించిన కార్యానికి కుడి దిశ నుండి సిద్ధమవుతారు.

దానధర్మాలో గొప్పవాడైన ధర్మరాజు, మయూరధ్వజుని దాన గుణానికి నివ్వెర పోతాడు.
ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు రావటం ధర్మరాజు గమనిస్తాడు . అందుకు వెంటనే స్పందిస్తూ....
"తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు " అంటాడు
అందుకు మయూరధ్వజుడు కూడా వెంటనే స్పందిస్తూ .....
" మహత్మా ! తమరు పొరబడుతున్నారు. నేను చింతిస్తూ బాధపడుతూ వేదన చెందుతూ నా శరీరాన్ని మీకు దానంగా ఇవ్వడం లేదు . నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది. ఆ భాగ్యం నాకు కలుగలేదు కదా అని ఎడమ నేత్రం మిగుల బాధపడుతున్నది " అంటూ వివరిస్తాడు.

అది విని కృష్ణుడు, ధర్మరాజు, మిక్కిలి ఆశ్చర్యపోతారు. మయూరధ్వజుని దానశీలతకు
ఉప్పొంగి పోతారు. వెంటనే తమ నిజరూపాన్ని ప్రదర్శిస్తారు.
" నీ దానశీలతకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో " అంటూ మయూరిధ్వజుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు.
మహానుభావుల నిజరూపాలు చూసి మయూరధ్వజుడు వుక్కిరిబిక్కిరవుతూ
"పరమాత్మా! నా ఈ శరీరం అశాశ్వతమైనది.. కార్యక్రమం లో ఈ శరీరం నశించినా, నా ఆత్మ పరోపకారార్ధం ఉపయోగపడేలా.... నిత్యం మీ ముందుండేలా....దీవించండి" అని హస్తాలతో ముకులళిత కోరుకుంటాడు . అందుకు శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తూ ....

" మయూరధ్వజా! తథాస్తు! నేటి నుండే భూలోకంలో ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజ స్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ చీరంజీవియై....నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది.
పరోపకారార్థం నీవు ప్రకాశిస్తావు....
ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మసఫలం అవుతుంది. నీ శిరస్సున వుంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపుతుంది..... " అంటూ అనుగ్రహిస్తాడు.

అందుకే ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజ స్తంభాలు విధిగా ప్రతిష్టించడం ఆచారమయింది. కాగా ఇంతటి గొప్ప దానశీలి త్యాగమూర్తి అయిన మయూరధ్వజుని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభాల నీడ కూడా తమ ఇళ్ళపై పడకూడదని చెప్పటం ఆ మహనీయుని పట్ల మన ప్రజలు చేసే అపచారం, ఇదొక మూఢ నమ్మకం.

#వివరణ : దాన గుణానికి జరిగిన ఉద్దేశపూర్వక పరీక్ష ఈ వృత్తాంతం ! యాగశ్వాన్ని బంధించడం నుండి, అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు ఓడిపోవడం నుండి, జరిగిన సంఘటనలన్నీ మయూరధ్వజుని దాన గుణాన్ని నిరూపించడం కోసం ఒక వ్యూహంగా కొనసాగినది.

#ప్రగతిసంచలనం

49 వసంతాలు పూర్తి చేసుకున్న  తెలుగు జాతి వెలుగు  'ఈనాడు'  1974 ఆగస్టు 10న తన అక్షర జ్యోతి కాంతితో తెలుగు నాట వెలుగులు ని...
09/08/2023

49 వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగు జాతి వెలుగు 'ఈనాడు'
1974 ఆగస్టు 10న తన అక్షర జ్యోతి కాంతితో తెలుగు నాట వెలుగులు నింపాలని ... ఆకాంక్షిస్తూ మన శ్వేత వర్ణ సూర్యుడు చెరుకూరి రామోజీరావు వెలిగించిన అఖండ జ్యోతి "ఈనాడు". 2023 ఆగస్టు 10న 49 వసంతాలు పూర్తి చేసుకుని 50వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు.

తిరుమలకు అనుకోకుండా ప్రయాణం చేయవలసి వచ్చిందా? అన్లైన్ లో రూం బుక్ చేయడం కుదరలేదని దిగులు వద్దు. తిరుమలలో ఉన్న వివిధ మఠాల...
02/08/2023

తిరుమలకు అనుకోకుండా ప్రయాణం చేయవలసి వచ్చిందా? అన్లైన్ లో రూం బుక్ చేయడం కుదరలేదని దిగులు వద్దు. తిరుమలలో ఉన్న వివిధ మఠాలలో మీరు గదిని పోందవచ్చు.
వాటి వివరాలు ఇక్కడ....

మనకు తిరుమలలో వసతి దొరికే ప్రాంతాలు, వాటి ఫోన్ నంబర్లు:
Mool Mutt Ph:0877-2277499.
Pushpa Mantapam Ph:0877-2277301.
Sri Vallabhacharya Jee Mutt Ph:0877-2277317.
Uttaradhi Mutt (Tirupati) Ph-0877-2225187.
Shree Tirumala Kashi Mutt Ph-0877-2277316.
Sree Raghavendra Swamy Mutt Ph-0877-2277302.
Sri Vaykhanasa Divya Siddanta
Vivardhini Sabha Ph:0877-2277282.
Sri Kanchi Kamakoti Mutt Ph:0877-2277370.
Sri Pushpagiri Mutt Ph-0877-2277419.
Sri Uuttaradi Mutt Ph-0877-2277397.
Udupi Mutt Ph-0877-2277305.
Sri Rangam Srimad Andavan Ashramam Ph:0877-2277826.
Sri Parakala Swamy Mutt Ph:0877-2270597,2277383.
Sri Tirupati Srimannarayana Ramanuja
Jeeyar Mutt Ph:0877-2277301.
Sri Sringari Saradha Mutt Ph:0877-2277269,2279435.
Sri Ahobita Mutt Ph:0877-2279440.
Sri Tirumala Kashi Mutt phone : 222 77316
Udipi Mutt Ph:0877 222 77305
Sri Sri Sri Tridandi Ramanujajeeyar Mutt Ph:0877 222 77301)
Sri Kanchi Kamakoti Peetam Mutt/ Sarva Mangala Kalyana Mandapam Ph:0877 222 77370)
Sri Vallabhacharya Mutt phone : 222 77317
Mantralaya Raghavendra Swami Mutt/ Brindavanam Ph:0877 222 77302
Arya Vysya Samajam S.V.R.A.V.T.S Ph:0877 222 77436
Srirangam Srimad Andavan Ashram Ph:0877 222 77826
Sri Vaikhanasa Ashram Ph:0877 222 77282
Sri Ahobila Mutt Ph:0877-2279440
Sri Sringeri Shankara Mutt/ Sarada Kalyana Mandapam Ph:0877 222 77269
Motilal Bansilal Dharmasala Ph:0877 222 77445
Hotel Nilarama Choultry Ph:0877 222 77784
Sri Srinivasa Choultry Ph:0877 222 77883
Sri Hathiramji Mutt Ph:0877 222 77240
Karnataka Guest House Ph:0877 222 77238
Dakshina India Arya Vyaya Gubba Muniratnam Charities Ph:0877 222 77245
Sri Sringeri Sankara Nilayam Ph:0877 222 79435
Sri Swamy Hathiramji muttam Ph:0877-2220015

*రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం.*సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, శిక్షలు ఉండవు...F.I.R నమోదు చేయకూడదు, ఇప్పటికే నమోదైన కేసు...
30/07/2023

*రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం.*

సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, శిక్షలు ఉండవు...F.I.R నమోదు చేయకూడదు, ఇప్పటికే నమోదైన కేసులను రద్దు చేయండి.

ఒకవేళ సోషల్ మీడియా పోస్టులపై కేసులు గాని నమోదు చేస్తే వెంటనే తొలగించేయండి ఎటువంటి కేసులు ఉంచొద్దు..

ఒకవేల పోలీసులు గనక అతి ఉత్సాహం ప్రదర్శించి కేసు పెట్టి వేధిస్తున్నట్లయితే
ఈ ఆర్డర్ కాఫీతో కోర్ట్ మెట్లు ఎక్కి పోలీసు వారిపై చర్య తీసుకోమనవచ్చు...

ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి తిరుపతి.. IRCTC అదిరిపోయే ఆఫర్.. వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా!IRCTC Package: తిరుమల తిరుపతి వ...
27/07/2023

ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి తిరుపతి.. IRCTC అదిరిపోయే ఆఫర్.. వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా!

IRCTC Package: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం చాలా మంది ఎదురుచూస్తుంటారు. అక్కడికి వెళ్లేందుకు చాలా ముందు నుంచే ప్లాన్స్ వేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు అలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్యాకేజీ తీసుకొచ్చింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

IRCTC Tour Package: తిరుమలలో వెలసిన శ్రీనివాసుడి దర్శనం కోసం ఎందరో భక్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తుంటారు. దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని పరితపిస్తుంటారు. తిరుమల ప్రయాణమంటే మాటలా? అన్నీ పకడ్బందీగా ముందే ఏర్పాటు చేసుకోవాలి. దర్శనంతో పాటు ప్రయాణ టికెట్లు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాలంటే చాలా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. అలాంటి వారి కోసం రెండ్రోజుల్లోనే శ్రీవారి దర్శనం పూర్తి చేసుకొని.. తిరుగు ప్రయాణం అయ్యేలా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక ప్యాకేజీ తీసుకొచ్చింది. దర్శన టికెట్ల కోసం చింతించాల్సిన పని లేకుండా.. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు.

విమాన ప్రయాణమే కాబట్టి కేవలం రెండే రోజుల్లో తిరుపతి వెళ్లి తిరిగి హైదరాబాద్ కూడా చేరుకోవచ్చు. తిరుమల సహా చుట్టు పక్కల పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకోవచ్చు. మీరు ఒకవేళ ఇప్పుడు తిరుపతి ప్రయాణానిని సిద్ధమవుతుంటే.. ఈ ప్యాకేజీపై లుక్కేయండి మరి.

తిరుపతి బాలాజీ దర్శనం (Tirupati Balaji Darshnam) పేరిట IRCTC ఈ టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఆగస్టు 1 నుంచి ఈ యాత్ర స్టార్ట్ అవుతుంది. రెండే రోజుల్లో స్వామి వారి దర్శనం ముగించుకొని తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చు. తిరుపతి మాత్రమే కాకుండా కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు ఆలయ దర్శనం కూడా చేసుకోవచ్చు. ఆగస్టు నెలలో అయితే 1,3, 8,10, 17,22 తేదీలు.. అలాగే సెప్టెంబర్ 12,26; అక్టోబర్‌లో 3,5, 1, 12, 31 తేదీల్లో ఈ యాత్ర ఉంటుంది. ఆగస్టు 1,10 తేదీల్లో ప్రయాణానికి టికెట్లను యాత్రికులు ఇప్పటికే పూర్తిగా కొనుగోలు చేశారు. మిగతా తేదీల్లో అయితే ప్రయాణ సమయానికి అనుగుణంగానే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

జర్నీ ఎలాగంటే?

హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంటకు విమానం (6E- 2005) బయల్దేరుతుంది. మధ్యాహ్నం 2.05 గంటలకు అంటే గంటలోనే తిరుపతి ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి బస్సు మార్గంలో కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు ఆలయలు సందర్శించుకుంటారు. సాయంత్రానికి ముందుగా మీకోసం ఏర్పాటు చేసిన హోటల్ చేరుకుంటారు. రాత్రి భోజనం అక్కడే ఉంటుంది.

రెండో రోజు పొద్దున్నే అల్పాహారం తీసుకున్న తర్వాత కొండపైకి చేరుకుంటారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా వెంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. తర్వాత భోజనం చేసి శ్రీకాళహస్తికి వెళ్తారు. అక్కడ ఆలయ దర్శనం తర్వాత తిరుపతి విమానశ్రయానికి మళ్లీ చేరుకుంటారు. హైదరాబాద్ చేరుకోవడానికి 6E-267 విమానం ఎక్కడంతో మీ యాత్ర పూర్తవుతుంది.

ప్యాకేజీ వివరాలు ఇలా.. (టికెట్ రేటు ఒక్కొక్కరికి)

సింగిల్ షేరింగ్ - రూ. 16,330
ఇద్దరికి షేరింగ్ - రూ .14,645
ట్రిపుల్ ఆక్యుపెన్సీ - రూ. 14,550
ఇక 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసు ఉన్న చిన్నారులకు ఒకరికి విత్ బెడ్ అయితే రూ. 13,740, విత్ అవుట్ బెడ్ అయితే రూ. 13,490 చెల్లించాలి.
రెండేళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారుల కోసం రూ. 1500 వరకు ఎయిర్‌పోర్టులో చెల్లించాలి.

ప్యాకేజీలో ఏమేం ఉంటాయి..

హైదరాబాద్- తిరుపతి- హైదరాబాద్ విమాన టికెట్లు (పోను రానూ అన్నమాట)
తిరుపతి ఒక రాత్రి బస చేసేందుకు ఏసీ హోటల్ రూం
మొదటి రోజు రాత్రి భోజనం, రెండో రోజు పొద్దున అల్పాహారం, మధ్యాహ్న భోజనం
ఒక చోటు నుంచి మరో చోటుకు ఏసీ బస్సు ప్రయాణం
తిరుమల శ్రీవారి దర్శన టికెట్లతో పాటు తిరుచానూర్, శ్రీకాళహస్తి కాణిపాకం, శ్రీనివాస మంగాపురం దర్శనాలు వంటివి ఈ ప్యాకేజీలో భాగంగానే ఉంటాయి.
యాత్రికులకు గైడ్ సహా ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.

ప్రయాణికులు గుర్తుంచుకోవాల్సినవి ఇవే..

ప్రయాణానికి 2 గంటలు ముందుగానే భక్తులంతా విమానశ్రయానికి చేరుకోవాలి.
పర్యటక ప్రదేశంలో ఎక్కడైనా ఎంట్రీ ఫీ వంటివి ఎవరివి వారే చెల్లించాలి.
ఫ్లైట్ టికెట్ ధర ఒకవేళ పెరిగితే ప్రయాణికులే చెల్లించాలి.
12 ఏళ్ల లోపు చిన్నారులకు మాత్రం లడ్డూ ప్రసాదం ఉండదు.
తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలంటే స్త్రీ, పురుషులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులే ధరించాలి.
ఏ కారణంతోనైనా 21 రోజుల ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే.. టికెట్‌పై 30 శాతం మీ టికెట్ రేటు నుంచి మినహాయిస్తారు. 21-15 రోజుల ముందు క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం 55 శాతం, 14-08 రోజుల ముందు క్యాన్సిల్ చేసుకుంటే 80 శాతం మీ టికెట్ ధర నుంచి మినహాయిస్తారు. ప్రయాణానికి 7 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే తిరిగి చెల్లించరు.
ఇంకా ప్యాకేజీకి సంబంధించిన ఇతర వివరాలు, బుకింగ్ కోసం IRCTC Tourism వెబ్‌సైట్ సందర్శించండి.

🌀తిరుమలకు ఉన్న ఎనిమిది వాడుకదారులు ఏవి.?🌀💥సాధారణంగా మనకు తెలిసినంత వరకు అలిపిరి మెట్ల మార్గం ఒకటి. రెండోది శ్రీవారి మెట్...
09/07/2023

🌀తిరుమలకు ఉన్న ఎనిమిది వాడుకదారులు ఏవి.?🌀

💥సాధారణంగా మనకు తెలిసినంత వరకు అలిపిరి మెట్ల మార్గం ఒకటి. రెండోది శ్రీవారి మెట్టు మార్గం. ప్రస్తుతం అలిపిరి మరియు శ్రీవారి మెట్టు మార్గం మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా తిరుమల చేరుకోవడానికి రెండు ఘాట్ రోడ్డుఉన్నాయి. అప్పుడప్పుడు కడపజిల్లా వాసులు గుంపులు గుంపులుగా మామండూరు ప్రాంత్రం నుంచి నడకమార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. హిందువులు దర్శించే పుణ్యక్షేత్రాలలో అతి మహిమ గలది కలియుగ వైకుంఠం అయిన తిరుమల. ప్రతిహిందువూ జన్మలో ఒక్కసారైనా తిరుమల దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. భక్తులు రోడ్డు మార్గం లేదా మెట్లు మార్గం ద్వారా తిరుమలకు చేరుకోంటారు. శ్రీవారి ఆలయానికి చేరుకోవాటానికి మొత్తం 8దారులు ఉన్నాయి. వాటిలో మొదటిది ప్రధానమైనది అలిపిరి.

👉 1 ఆదిపడి లేదా అలిపిరి. క్రీ.శ.1387లో మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లు నిర్మించారు. క్రీ.శ.1550లో విజయనగర సామంతులు అలిపిరి, గాలిగోపరం మార్గం నిర్మించారు. మొదటి నుండి అలిపిరి దారే ప్రధాన దారిగా గుర్తింపు పొందింది. ఆదిపడి కాలక్రమంలో అలిపిరి అయింది. ఆదిపడి అంటే మొదటి మెట్టు అని అర్థం. ఈమార్గంలో తిరుమల చేరుకోవాలంటే పన్నెండు కిలోమీటర్ల (12) నడవాలి. అలిపిరి మార్గంలో మొత్తం 3550 మెట్టు ఉన్నాయి. సుమారు మూడు నుండి నాలుగు గంటలలో కొండను చేరుకోంటారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున జనం వినియోగిస్తున్న దారి ఇదే.

👉 2 శ్రీవారిమెట్టు. తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో శ్రీనివాసమంగాపురం ఉంది. అక్కడి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. ఈ దారి నుండి మూడు కిలోమీటర్లు నడిస్తే తిరుమల వస్తుంది. ఈ మెట్టు దారిన నడిస్తే ఒక గంటలో తిరుమల చేరుకోవచ్చు.

👉 3 మామండూరు అడవి. ఒకప్పుడు బాగా రద్దీగా ఉండే నడకదారి మామండూరుదారి. పూర్వం కడప, రాజంపేట కోడూరుల మీదుగా వచ్చే భక్తులకు మామండూరు దారి ఎంతో అనుకూలంగా ఉండేది. మామండూరు నుండి బయలుదేరితే ఉత్తరాన కరివేపాకు కోన వస్తుంది. ఆతర్వాత పాలసత్రం వస్తుంది. ఇంకొంచెం దూరం పోతే ఈతకాయల మండపం తర్వాత పడమర వైపు కొంత దూరం వెళ్తే తిరిరుమలలోని గోగర్భడ్యాం వస్తుంది. తిరుమల నుండి మామండూరు వెళ్ళే నడక మార్గంలో పాలసత్రం నుండి దక్షిణ వైపు వెళ్లే కాకుల కొండ వస్తుంది. ఈకాకుల కొండ మీదగా వెళ్తే మామండూరు చేరు కోవచ్చు. ఇప్పటికి అప్పుడప్పుడు రాజంపేట ప్రాంతవాసులు ఈ దారిలో తిరుమల చేరుకుంటారు.

👉 4 కుక్కలదొడ్డి నుంచి తుంబుర తీర్థం, పాపవినాశనం మీదుగా కడప జిల్లా సరిహద్దులోని చిత్తూరు జిల్లాకు చెందిన కుక్కలదొడ్డి నుండి తుంబురుతీర్థం నుండి పాపవినాశానానికి అక్కడ నుండి తిరుమలకు దారి వుంది. దీన్ని తుంబుర తీర్థం అంటారు. పాపవినాశనం నుండి తుంబురతీర్థానికి పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. పాపవినాశనం నుండి తిరుమలకు సులభంగా రోడ్డు మార్గాన చేరుకోవచ్చు.

👉 5 కళ్యాణిడ్యామ్. కళ్యాణిడ్యామ్ కి అనుకున్ని ఉన్న శ్యామలకోన దారిలో పదిహేను కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే తిరుమల నారాయణగిరి వస్తుంది. అదే దారిలో ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణిస్తే ఒకగంటలో భక్తులు తిరుమల చేరుకోవచ్చు.

👉 6 రేణిగుంట నుంచి అవ్వచారికోన దారి. ఈ అవ్వాచారి కొండ మొదటి ఘాట్ రోడ్డులో అక్కగార్ల గుడి ముందు మోకాలి పర్వతం ఉంది. రేణిగుంట సమీపంలో తిరుపతి కడప రహదారిలో ఆంజనేయపురం ఉంది. ఇక్కడ నుండి అవ్వాచారి కోన అడుగు భాగంలో నడిచి పడమర వైపుకి వెళ్తే మోకాళ్ళ పర్వతం వస్తుంది. ఇక్కడే రామానుజాచార్యుల వారి ఆలయం ఉంది. మోకాళ్ళమిట్ట చేరుకున్నాక పక్కనే సారే పెట్టెలను చూడోచ్చు. అక్కడ నుంచి ముందుకు వెళితే లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వస్తుంది. మెట్టు దిగుతూనే అవ్వాచారి ఆలయం వస్తుంది. అటునుండి నడుచుకుంటూ అనేక మండపాల గుండా వెళ్తే తిరుమల శ్రీవారి ఆలయం వస్తుంది.

👉 7 ఏనుగుల దారి. ఇవేకాక ఏనుగుల దారి కూడా ఒకటి ఉంది. చంద్రగిరి ప్రక్కన ఉండే శ్రీవారిమెట్టు మార్గం నుండి అవ్వాచారికోన వరకూ ఒకదారి ఉండేది ఒకప్పుడు. తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు రాతి స్తంభాలను ఈ దారి నుండే ఏనుగుల ద్వారా చేరవేసేవారు. కాబట్టి దీనికి ఏనుగుల దారి అనే పేరు వచ్చిందంటారు. ఇప్పుడు ఈ దారిని ఎర్రచందనం స్మగ్లర్లు వాడుతున్నారు.

👉 8 తలకోన నుంచి. తలకోననుంచి కూడా తిరుమలకు మరో దారుంది. ఈ దారి తలకోన జలపాతం దగ్గర నుండి జండాపేటు దారిలో వస్తే తిరుమల వస్తుంది. ఈ దారి పొడవు దాదాపు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది. అప్పటో శ్రీకాళహస్తి నుండి కరకంబాడి, చెన్నాయిగుంట, మంగళం, అక్కారంపల్లి, కపిలతీర్థం వరకు ఒక మార్గం ఉండేది. అదే విధంగా శ్రీకాళహస్తి నుండి తొండమానుడు, గుడిమల్లం, నీలిసాని పేట, గాజులమండ్యం, కొల్లూరు, అత్తూరు, పుత్తూరుల గుండా నారాయణవరం, నాగాలపురానికి మరోకదారి వుండేది. ఆరోజుల్లో తిరుపతి తొండమండలంలో ఒక భాగం. నారాయణవరం ఆకాశరాజు కాలంలో రాజధాని. ఇక్కడే కళ్యాణ వేంకటేశ్వరుని గుడి ఉంది.

𝟏𝟎 𝐋𝐞𝐬𝐬𝐨𝐧𝐬 𝐅𝐫𝐨𝐦 𝐑𝐮𝐥𝐞𝐬 𝐎𝐟 𝐖𝐨𝐫𝐤 1. Walk Your TalkWhenever you say something, live by it. Let people know you as a person w...
26/06/2023

𝟏𝟎 𝐋𝐞𝐬𝐬𝐨𝐧𝐬 𝐅𝐫𝐨𝐦 𝐑𝐮𝐥𝐞𝐬 𝐎𝐟 𝐖𝐨𝐫𝐤

1. Walk Your Talk
Whenever you say something, live by it. Let people know you as a person who does what he says he will do. Always walk your talk.

2. Have A Plan
No matter whats going on, always have a plan in life. Plan for the year. Plan for the next 2 years. Plan for the next 5 years. And plan for the next 20 years. Have a plan.

3. Carve A Niche For Yourself
Create a unique identity with what you do. Make sure you are known for doing something unique. Don’t get involved in what everyone is doing. Do something special.

4. Stay Focused On Your Long Term Goals
You can’t afford to lose sight of your long-term goal for a second. For you there is no time off, no downtime, no loung-ing around time, no slipups, no mistakes, no accidental deviations from the script.

You have to become like a master criminal—they lead incredibly law-abiding lives because they can’t risk breaking a tiny law in case it draws attention to themselves and the really big crimes get revealed—and watch what you say and what you do.

5. Learn From Others Mistakes
A clever man learns from his own mistakes, but a wise man learns from others’ mistakes. Learn from the mistakes of others. Study how others made errors and commit to avoiding them.

6. Develop The Right Attitude
Be optimistic. Be positive. Share positivity with your colleagues, your friends and your acquaintance. The right attitude will attract you the right people to your life.

7. Cultivate a Smile
Smile when it’s getting tough. Smile when it’s hell. Smile no matter what.
And what sort of smile? Friendly, genuine—make sure it extends to your eyes—sincere, frank, honest, open, happy.

8. Be Cool
At work you should retain your cool at all times and, no matter what, never ever lose your dignity. If there’s an office costume party, you can laugh and joke with everyone else, but let them do the dressing up. You remain apart from all that office nonsense.

9. Speak Well
You can keep your regional accent; that’s not the problem. Look at why we speak—it is to communicate, to convey information—rather than how we speak. Speaking well means getting information across clearly and effectively. It doesn’t matter how you speak, but it does matter that you speak clearly.

10. Know Yourself—Strengths and Weaknesses
If you are going to be a winner, you have to be incredibly objective about yourself. A lot of people can’t do this; they can’t turn the spotlight on themselves objectively enough or brightly enough to see themselves as others see them. And it’s not just how others see us; it’s also how we see ourselves. We all carry a mental image of ourselves—what we look like and sound like, what makes us tick; how we work—but how realistic is this image?

Thank you for reading.

BOOK: https://amzn.to/3r4x2VM

Success demands these 6 things.. (The Secret Formula) 1.  Hard Work Don't believe in luck, believe in hard work. Stop tr...
26/06/2023

Success demands these 6 things..

(The Secret Formula)

1. Hard Work

Don't believe in luck, believe in hard work.

Stop trying to rush the process or searching for a shortcut.

There is none.

2. Patience

If you are losing the patience, you are losing the battle.

First nothing happens, then it happens slowly and suddenly all at once.

Most people give up at stage one.

3. Sacrifice

If you don't sacrifice for what you want, then what you want becomes the sacrifice.

Everything has its price. The question is: Are you ready to pay it for the life you desire?

4. Consistency

Consistency is what transforms average into excellence.

Without consistency, you will never achieve greater success.

5. Discipline

Motivation gets you going, but discipline keeps you growing.

There will be days when you don't “feel” like doing it.

You have to push through those days regardless of how you feel.

6. Self Confidence

Confidence is, I'll be fine if they don't like me.

Follow 👉 RS NAIDU

📞(Flash News)📞ఆల్ ఇండియా ట్యాక్స్ పేయర్స్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిన్న న...
26/05/2023

📞(Flash News)📞ఆల్ ఇండియా ట్యాక్స్ పేయర్స్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిన్న నిర్ణయించింది, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించింది. ఏ ప్రభుత్వం పాలిస్తున్నప్పటికీ, ఈ సంస్థ ఆమోదం లేకుండా ఏ ప్రభుత్వమూ ఉచిత విద్యుత్, ఉచిత నీరు, ఉచిత పంపిణీ లేదా రుణమాఫీలను ప్రకటించదు. డబ్బు మా పన్ను చెల్లింపుదారులకు చెందినది కాబట్టి, దాని వినియోగాన్ని పర్యవేక్షించే హక్కు పన్ను చెల్లింపుదారులకు ఉండాలి. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఉచితాలను పంచుతూ ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఏ ప్రాజెక్టులు ప్రకటించినా ముందుగా ప్రభుత్వం వాటి బ్లూప్రింట్‌లను సమర్పించి ఈ సంస్థ నుంచి అనుమతి పొందాలి. ఇది MPలు మరియు MLAల జీతాలకు మరియు వారు పొందే ఇతర విచక్షణ రహిత ప్రయోజనాలకు కూడా వర్తింపజేయాలి. ప్రజాస్వామ్యం కేవలం ఓటుకు మాత్రమే పరిమితమా? ఆ తర్వాత పన్ను చెల్లింపుదారులుగా మనకు ఎలాంటి హక్కులు ఉన్నాయి? పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకున్నందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలను జవాబుదారీగా ఉంచి, వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే హక్కు పన్ను చెల్లింపుదారులకు ఉండాలి. వారు అన్ని "సేవకులు" తర్వాత పన్ను చెల్లింపుదారులచే చెల్లించబడతారు. అటువంటి "ఉచితాలను" ఉపసంహరించుకునే హక్కు కూడా వెంటనే అమలు చేయాలి. మీరు అంగీకరిస్తే, దయచేసి వీలైనంత ఎక్కువ మందిని సంప్రదించండి. దీన్ని చేయడానికి, పోస్ట్‌ను భాగస్వామ్యం చేయండి. దీన్ని మీ స్నేహితుల్లో కనీసం 10 మందికి పంపండి. దయచేసి ఈ సందేశాన్ని వైరల్ చేయడానికి షేర్ చేయండి. 🙏 https://www.nationalheraldindia.com/india/sc-forming-panel-to-examine-issue-of-freebies-by-political-parties-is-burial-by-committee-experts *ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న చాలా శుభవార్త.* 👏👏👏👏👏

“The question before SC and committee is, what will be the effect of these freebies on elections. How is the committee going to answer that question?” senior counsel Rajeev Dhavan wondered

Address

Amaravati

Telephone

+919154455557

Website

Alerts

Be the first to know and let us send you an email when ℝ𝕊 ℕ𝔸𝕀𝔻𝕌 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ℝ𝕊 ℕ𝔸𝕀𝔻𝕌:

Share

Category


Other Publishers in Amaravati

Show All