PVS MEDIA

PVS MEDIA రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాల వే?

10/07/2022
ఆయాల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి -ఏఐటీయూసీ మండల కార్యదర్శి పి.వి.సుబ్రహ్మణ్యంఆగిరిపల్లి :ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్...
29/06/2022

ఆయాల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి -ఏఐటీయూసీ మండల కార్యదర్శి పి.వి.సుబ్రహ్మణ్యం
ఆగిరిపల్లి :
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాల(స్వీపర్లు) పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని ఏఐటీయూసీ మండల కార్యదర్శి పి.వి.సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. బుధవారం ఆయాలతో కలిసి మండల విద్యాశాఖ అధికారి పి. రత్నకుమార్ ను ఆయన కార్యాలయంలో నుబ్రహ్మణ్యం కలిశారు. మార్చి, ఏప్రిల్, మే నెల జీతాలు ఆయాలకు ఇంత వరకు అందలేదని ఎంఈవో దృష్టికి తీసుకెళ్లారు. ఆయాలుగా పనిచేస్తున్న వారు రెక్కాడితే గానీ డొక్కాడని పేదలని, వారికి జీతాలు అందక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వెంటనే ఆయాలకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంఈవో రత్నకుమార్ సమాధానం చెబుతూ వేతనాలు పెండింగ్లో లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మే, జూన్ మాసాలకు సంబంధించిన ఆయాలకు నెలకు రూ.3 వేలు చొప్పున మాత్రమే చెల్లించనుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయాలు డి. బుజ్జి, పి. యశోద, అనం లక్ష్మి, పి.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

24/05/2022
ప్రభుత్వం పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, స్వేపర్లు సమస్యల పై మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర డైరెక్టర్ దివాన్ మైదీన్ ...
06/05/2022

ప్రభుత్వం పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, స్వేపర్లు సమస్యల పై మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర డైరెక్టర్ దివాన్ మైదీన్ గారిని విజయవాడలో గురువారం కలిసి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు స్రవంతి, కార్యదర్శి రమేష్, నాయకులు గోవింద్ రాజులు, చాట్ల పుల్లారావు, పి. వి. సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

04/05/2022

నూజివీడు, అగిరిపల్లి, బాపులపాడు మండలాలలోని కిరాణా, పచారి మరియు జాగరీ వర్తకుల అందరికీ నమస్కారం,

ప్రభుత్వం రాష్ట్రంలో నాటుసారా ని పూర్తిగా నిర్మూలించడానికి కార్యాచరణ ప్రకటించింది. జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీసులు మరియు SEB సిబ్బంది సారా అమ్మకాలు మరియు తయారీ స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నారు. సారా తయారీ లో ముడి పదార్థం అయినా బెల్లం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. ఎవరైనా వర్తకులు తెలిసి గాని తెలియక గాని నాటుసారా తయారీ కి బెల్లం విక్రయిస్తే వారిని కేసులో involve చేయడం జరుగుతుంది. వారిని రిమాండ్ ( జైలు )కు పంపడం జరుగుతుంది. దయచేసి మీరు బెల్లం విక్రయించే టప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని బెల్ల విక్రయించాల్సి గా కోరుతున్నాము. రెండు కేజీలు మించి బెల్లం అమ్మేటప్పుడు వారు దేనికి కొంటున్నారో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకో గలరు.

మాకు దొరికిన ప్రతి కేసులోనూ ముద్దాయికి బెల్లం ఎవరు ఇచ్చారో రాయాలనే కఠినమైన ఉత్తర్వులు మాకు ఉన్నాయి. మాకు దొరికిన ముద్దాయి ఎవరైనా ఫలానా షాపులో బెల్లo కొన్నాము అంటే మేము తప్పకుండా మాకు ఉన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ షాప్ యజమాని పేరు కేసులో రాస్తాము మరియు వారిని జైలుకు పంపుతాము. దయచేసి సహకరించండి. నాటుసారా తయారీ లో భాగస్వామ్యం కాకండి.

మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింది నెంబర్ కి ఫోన్ చేయండి.

ఇన్స్పెక్టర్,
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో
నూజివీడు 9440902462.

10.5.2022వ తేదీన ఆగిరిపల్లిలో జాబ్ మేళా
04/05/2022

10.5.2022వ తేదీన ఆగిరిపల్లిలో జాబ్ మేళా

సీపీఐ కృష్ణాజిల్లా సమితి చివరి సమావేశం అనంతరం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, జిల్లా కార్యదర్శి వనజ గారితో జిల్లా సమిత...
01/05/2022

సీపీఐ కృష్ణాజిల్లా సమితి చివరి సమావేశం అనంతరం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, జిల్లా కార్యదర్శి వనజ గారితో జిల్లా సమితి సభ్యులు దిగిన గ్రూప్ ఫొటో..

కార్మికులకు అండ ఏఐటీయూసీ జెండా-ఎస్. టి. యు. జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ -ఆగిరిపల్లిలో ఘనంగా మేడే వేడుకలు ఆగిర...
01/05/2022

కార్మికులకు అండ ఏఐటీయూసీ జెండా
-ఎస్. టి. యు. జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్
-ఆగిరిపల్లిలో ఘనంగా మేడే వేడుకలు
ఆగిరిపల్లి :
కార్మికులు, కర్షకులకు ఏఐటీయూసీ జెండా అండగా ఉంటుందని ఎస్. టి. యు. ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్.సురేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం ఆగిరిపల్లి గ్రామ పంచాయతీ శివారు అమ్మవారిగూడెం తిప్ప (పార్వతి తిప్ప ) వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏఐటీయూసీ జెండాను ఎస్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షులు పి.నరసింహారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ మండల కన్వీనర్ పి.వి. నుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సభలో ఎన్టీయూ ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం పోరాడే సంఘం ఏఐటీయూనీ అని తెలిపారు. ఎన్టీయూగా ఉపాధ్యాయ సమస్యలపై పోరాడటంతో పాటు కరోనా నమయంలో పేదలకు లక్షల రూపాయల సాయం అందించామని తెలిపారు. ప్రశ్నిస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అమ్మవారిగూడెం తిప్ప వానులకు ఏ సమస్య వచ్చినా తాము ఎన్టీయూగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ అబ్దుల్ హక్ మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయని ఆరోపించారు. కార్మికులు ఐక్యంగా ఉండి నమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ మండల కన్వీనర్ పి.వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అమ్మవారిగూడెం తిప్పపై నివాసం ఉంటున్న అన్ని రకాల కార్మికులకు తాము ఏఐటీయూసీగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారికి ఇళ్ల పట్టాలు వచ్చే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ మండల అధ్యక్షులు అంకం వెంకటేశ్వరరావు, ఎన్టీయూ మండల కోశాధికారి వంశీ, గ్రామస్తులు షేక్ నర్దార్, షేక్ సైదా, షేక్ రసూల్, రాజు తదితరులు పాల్గొన్నారు.

I

Address

Gannavaram Road
Agiripalli
521211

Telephone

+919010050972

Website

Alerts

Be the first to know and let us send you an email when PVS MEDIA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to PVS MEDIA:

Share


You may also like