Gaduggaai గడుగ్గాయ్

  • Home
  • Gaduggaai గడుగ్గాయ్

Gaduggaai గడుగ్గాయ్ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gaduggaai గడుగ్గాయ్, Magazine, .

ఊరీ ఊరని కథలు---------------- --------పిల్లలు మనం జీవించాలి అనుకున్న తీరుదారులకు ప్రతిబింబాలు. మనం ఒకప్పుడు ఏ కలలైతే కన్...
10/01/2025

ఊరీ ఊరని కథలు
---------------- --------

పిల్లలు మనం జీవించాలి అనుకున్న తీరుదారులకు ప్రతిబింబాలు. మనం ఒకప్పుడు ఏ కలలైతే కన్నామో, వాటిని జీవన గుండంలో వూపిరాడని మునకలలో ఎంతగా మరచిపోయామో - ఆ కలల లేత రెక్కలు బాలలు! కొత్తగా ననలు సాగిన జీవనలతలకు పొటమరించిన చిరు మొగ్గలు పిల్లలు. వాళ్ళలోని తీపిఆశలకు, రహస్యఆపేక్షలకు, దాగినభయాల, వెల్లడి కాని ఆశయాల, తెలిసీ తెలియని సంకోచాలకు సృజనరూపం యిస్తే - మనల్ని అబ్బురపరచే కథలు మెరుస్తాయి; కమ్మని కల్పనల కథనాలు వెల్లివిరుస్తాయి.
అదిగో - అదే యీ బాలల కథల పోటీల్లో జరిగిన అద్భుతం! కురిసిన అమృతం!! దేశాల ఎల్లలు దాటి యీ పోటీకి వచ్చిన దరిదాపు డెబ్భై కథలను రాసిన లేత హృదయాలు - మా నేర్పు చూడమంటూ, మా కల్పనలు ఆస్వాదించమంటూ, మా చతురతను నిగ్గు తేల్చి నిర్ణయించ మంటూ ఎదుట నిలిచాయి. ఊరీవూరని ఊరగాయ - వచ్చీరాని మాటలు అమిత రుచికరం అన్న పెద్దల మాటలు యీ చిన్నారి రచయితల సృజనకు సరిగ్గా అన్వయిస్తాయి.

ఇక్కడ మనం ప్రత్యేకంగా అభినందించవలసినది - యీ విద్యార్థుల ఊహలను ప్రేమించి ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయుల్ని, మార్కులు ర్యాంకుల గోల నుంచి తప్పించి పిల్లలు కొంత సమయాన్నయినా ఊహాశాలితకు కేటాయించటాన్ని ఆదరిస్తున్న కుటుంబసభ్యుల్ని, అంతకుమించి పోటీల నిర్వాహకులను! ర్యాంకులవేటలో పిల్లలప్రపంచాన్ని ధ్వంసం చేస్తున్న కుటుంబాలు, పాఠశాలలు, ఉపాధ్యాయులు, బడుల యాజమాన్యాలు కొల్లలుగా వున్న ప్రస్తుత విద్యాప్రపంచంలో - పసికౌశలాల సుగంధాలను పసిగట్టి సాహిత్యవనంలోకి ప్రసరింపచేస్తున్న యీ విద్యార్థుల టీచర్లు, అమ్మానాన్నలు ఎంతైనా అభినందనీయులు.

ఈ పోటీలో పిల్లలు తీసుకున్న విభిన్న వస్తువులు, వైవిధ్యం నింపుకున్న శైలి, పదజాలం- కథాసాహిత్యం భవితవ్యంపట్ల మనలో గోరువెచ్చని ఆశలను కల్పిస్తున్నాయి.

బాల రచయితలకు సిరిజోతలు!
వారి తల్లిదండ్రులకు, గురువులకు జేజేలు!!
-ఘంటశాల నిర్మల

Gaduggai Committee-2025
03/01/2025

Gaduggai Committee-2025

01/01/2025

Send a message to learn more

01/01/2025

గడుగ్గాయ్ సంక్రాంతి పోటీ-2025 ఫలితాలు

విజేతలందరికీ అభినందనలు, ఆశీస్సులు. బహుమతులని అందజేస్తున్న డా. గన్నవరపు నరసింహ మూర్తి గారికి, శ్రీమతి అమృతవల్లి కవి (అక్కరాజు) గారికి, డా. చదలవాడ ఉదయశ్రీ గారికి నమస్సులు.

న్యాయనిర్ణేతలు శ్రీమతి ఘంటశాల నిర్మల గారికి, శ్రీ పలమనేరు బాలాజీ గారికి కృతజ్ఞతలు.

పిల్లలను ప్రోత్సహించి, రచనలు చేయించి, ఎంతో బాధ్యతగా గడుగ్గాయ్ కి పంపిన ఉపాధ్యాయులు శ్రీ కందుకూరి భాస్కర్ గారికి, శ్రీ అశోక్ పోరెడ్డి గారికి, డా. కాసర్ల నరేష్ గారికి, శ్రీ ప్రవీణ్ శర్మ గారికి, శ్రీ చాగంటి అరవింద్ గారికి, శ్రీ కృష్ణ ఆలవాల గారికి, శ్రీమతి ఎన్.నాగమణి గారికి, శ్రీమతి వురిమళ్ళ సునంద గారికి, శ్రీ జానకిరాం ముక్కామల గారికి, శ్రీ వేణు ఓరుగంటి గారికి, శ్రీ బైతి దుర్గం గారికి, శ్రీమతి కరుణ గారికి, శ్రీమతి జె. నిర్మల గారికి, శ్రీమతి పూర్ణిమ గారికి, పిల్లల తల్లితండ్రులకి, పేరు చెప్పకుండా పిల్లల రచనలు పంపిన ఉపాధ్యాయులకి అనేకానేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

శ్రీమతి వెంకట రమణమ్మ, శ్రీ నారాయణమూర్తి గన్నవరపు గార్ల స్మారక బహుమతి పొందిన కథలు
మొదటి బహుమతి 1500 రూపాయలు
గరుడ కృష్ణ యద్దనపూడి 6వ తరగతి, ఆల్స్టన్ రిడ్జ్ మిడిల్ స్కూల్, కేరి, అమెరికా
రెండవ బహుమతి 1000 రూపాయలు
ఒకరికొకరు గాజంగుల శ్రీవేద 7 వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, లక్ష్మిపూర్, జైనద్, ఆదిలాబాద్
మూడవ బహుమతి 500 రూపాయలు
సమయ పాలన ఎమ్.డి.అఫీఫా 10 వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కోదాడ, సూర్యాపేట జిల్లా

శ్రీమతి వెంకట రమణమ్మ, శ్రీ నారాయణమూర్తి గన్నవరపు గార్ల స్మారక బహుమతి పొందిన వ్యాసాలు
మొదటి బహుమతి 1500 రూపాయలు
విచక్షణతో కూడిన మొబైల్ వాడకం టి.రేఖశ్రీ 10 వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , కోదాడ, సూర్యాపేట
రెండవ బహుమతి 1000 రూపాయలు
దీపావళి పండుగ జె.అన్షిత 6 తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్
మూడవ బహుమతి 500 రూపాయలు
ఆశ యం సాహితి 6 తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్

శ్రీమతి వెంకట రమణమ్మ, శ్రీ నారాయణమూర్తి గన్నవరపు గార్ల స్మారక బహుమతి పొందిన కవితలు (ఒకొక్క బహుమతి 300 రూపాయలు)
1.చెట్టు ఏ. రాహుల్, 9వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నర్సింహుల పల్లి, పెద్దపల్లి జిల్లా.
2.నా జ్ఞాపకాలు టి అక్షయ 10 వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,సిర్పూర్, నిజామాబాద్
3.మాబడి వి. గాయత్రి 9 తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్, తెలంగాణా
4.ప్రకృతి అందాలు టీ . హేమ లలిత, 9వ తరగతి, అరవింద హై స్కూల్, కుంచనపల్లి
5.గొప్ప స్నేహం రూపక్ 7వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఏరుగట్ల, జిల్లా..నిజామాబాద్,
6.నా ధైర్యం.. జె. రచన 10 వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,సిర్పూర్, నిజామాబాద్
7.అమ్మ పి. ప్రేరణ 7 తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్, తెలంగాణా
8.ప్రకృతి వి. గాయత్రి 9 తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్, తెలంగాణా
9.ఆదర్శం ఈ. నీహారిక 9వ తరగతి, అరవింద హై స్కూల్, కుంచనపల్లి
10.నేను నా బాల్యం జె. రచన 10 వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,సిర్పూర్, నిజామాబాద్

శ్రీమతి పాలెపు లక్ష్మీకాంతం గారి స్మారక ప్రోత్సాహక బహుమతులు పొందిన కథలు (ఒక్కొక్క బహుమతి 100 రూపాయలు)
1.మంచి రాజవ్వ నూనె శ్రీనిధి 8వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఏరుగట్ల నిజామాబాద్
2.అత్యాశకు ఫలితం బెందాళం సిద్ధార్థ్ 9వ తరగతి , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ముత్యాల పేట , శ్రీకాకుళం
3.అన్నదమ్ముల అనుబంధం ఎం. అనన్య 7వ తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్
4.ఆత్మ విశ్వాసం భాను 10వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఏరుగట్ల నిజామాబాదు
4.ఆదర్శం సుధానవేన శృతి 7వ తరగతి జిల్లా పరిషత్ హై స్కూల్ రామంచ చిన్నకోడూరు సిద్దిపేట
6.గోపయ్య ఉపాయం తాళ్లూరి రేఖశ్రీ 10వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కోదాడ, సూర్యాపేట జిల్లా
7.ఋషి రెండు పక్షులు వేముల నవదీప్ 7వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఏరుగట్ల,నిజామాబాద్
8.ఆశయం పేర్ని వర్షిణి 10వ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రామంచ, చిన్నకోడూరు సిద్దిపేట
9.కూతురు టి. సౌమ్య 10వ తరగతి, జి.ప.ఉ.పా. నర్సింహుల పల్లి, పెద్దపల్లి జిల్లా.
10.గ్రేట్ నైట్ టి. దుర్గారాజ్ 8వ తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్
11.చదువంటే ప్రాణం షేక్ ఫాతిమా 8 వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కోదాడ, సూర్యాపేట జిల్లా
12.చదువు బాసంపల్లి ఐశ్వర్య 7వ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామంచ చిన్నకోడూరు సిద్దిపేట
13.చివరి చెట్టు ఉమైజా అఫ్షీన్ 9వ తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్
14.చెట్టుతో స్నేహబంధం వైష్ణవి 9వ తరగతి,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏరుగట్ల నిజామాబాద్
15.తెలివైన కోడి హెడావ్ రాంచరణ్ 6వ తరగతి, జెడ్పిహెచ్ఎస్, లక్ష్మిపూర్, ఆదిలాబాద్
16.చెప్పిన మాట వినాలి డి. రిశ్వంత్ 9వ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఏరుగట్ల నిజామాబాద్
17.నిజాయితీ విలువ యస్. సాత్విక్ సాయికుమారాచార్యులు 10వతరగతి, సూర్యస్కూల్, అశ్వారావుపేట,
18.పర్యావరణ పరిరక్షణ ఎం. వినయ్ కుమార్ 8 వ తరగతి, , జెడ్పిహెచ్ఎస్, మేళ్ళచెర్వు , సూర్యాపేట
19.పల్లెటూరి గొప్పతనం అభిలాష్ 9వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏరుగట్ల నిజామాబాద్
20.మంచి స్నేహం హర్షవర్ధన్ 6వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జక్కాపూర్, సిద్దిపేట జిల్లా
21.మంచి స్నేహం గుంజ వెన్నెల, 7వ తరగతి,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోదాడ, సూర్యాపేట
22.పక్షులు కూడా అవసరమే భాను 10వ తరగతి, , జెడ్పిహెచ్ఎస్ , ఏరుగట్ల నిజామాబాదు
23.మార్పు సిహెచ్. ప్రేర్ణ 9వ తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్
24.మార్పు చెందిన పాపయ్య సాత్విక్ 9వ తరగతి , జెడ్పిహెచ్ఎస్ , రామంచ చిన్నకోడూరు సిద్దిపేట
25.సమయం విలువ బి. జాహ్నవి 7వ తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్
26.విలువ సారుగు హిందు 7వ తరగతి రామంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్నకోడూరు సిద్దిపేట
27.మంచితనం వేముల నవదీప్ 7వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏరుగట్ల,నిజామాబాద్
28.రాయి మరియు మాయ చెట్టు ప్రహర్షిత పాపిరెడ్డి 6వ తరగతి, మాల్బరో మిడిల్ స్కూల్, న్యూ జెర్సీ, అమెరికా
29.సమయం - సాధన దేదీప్య సిరిమామిళ్ళ 5వ తరగతి, ఫార్మింగ్టన్ హిల్స్, మిచిగాన్, అమెరికా
30. రైతు తెలివి పెరక రాజేష్ 7వ తరగతి,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏరుగట్ల జిల్లా నిజామాబాద్
31.సాహసం జె. రేఖ 9వ తరగతి, కె.జి.బి.వి. దుబ్బాక
32.సింహపురి సామ్రాజ్యపు చరిత్ర అజిత్ దువ్వూరి 9వ తరగతి, బయోటెక్నాలజీ హై స్కూల్, న్యూ జెర్సీ, అమెరికా
33. పట్టుదల పిడిశెట్టి మధుహాసిని, 9 వ తరగతి, జి.ప.ఉ.పా. జక్కాపూర్, సిద్దిపేట

శ్రీమతి వెంకట రమణమ్మ, శ్రీ నారాయణమూర్తి గన్నవరపు గార్ల స్మారక ప్రోత్సాహక బహుమతి పొందిన కథలు (ఒకొక్క బహుమతి 100 రూపాయలు)
1. అపరిచితులను నమ్మవద్దు ఆతుకూరి అమూల్య 7వ తరగతి, జి.ప.ఉ.పా, కోదాడ, సూర్యాపేట జిల్లా
2.అమ్మ - అభిలాష పేరం తన్విష్ 6వ తరగతి, వెరిటస్ ఎలిమెంటరీ స్కూల్, మంటెకా, అమెరికా
3.అమ్మ కిచ్చిన మాట కొంపల్లి విశిష్ట 10వ తరగతి, జి.ప.ఉ.పా జక్కాపూర్, సిద్దిపేట జిల్లా
4.కుక్క విశ్వాసం ఏ రాహుల్, 9వ తరగతి, జి.ప.ఉ.పా. నర్సింహుల పల్లి, పెద్దపల్లి.
5.ఎక్కువతక్కువలు యం. శాస్త్ర 7వ తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్
6.చిన్న కుటుంబం ఎస్. లౌకిక 8వ తరగతి, కె.జి.బి.వి.దుబ్బాక
7.ఎలుగుబంటి తెలివి ఎస్. నిష్ణశ్రీ 6వ తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్
8.చెట్ల కోసం మాడుగుల మహాలక్ష్మి 9 వ తరగతి, జి.ప.ఉ.పా, మేళ్ళచెర్వు , సూర్యాపేట
9.చెప్పుడు మాటలు జి. కృష్ణ మనోహర్ 7వ తరగతి, జి.ప.ఉ.పా. పాపకొల్లు, జూలూరుపాడు మండలం, భద్రాద్రి కొత్త గూడెం
10.చిన్న ఆలోచన వేముల రూపక్ 7వ తరగతి, జి.ప.ఉ.పా, ఏరుగట్ల,నిజామాబాద్ జిల్లా తెలంగాణ.
11.తగిన శాస్తి వి.వర్షిత 7వ తరగతి , జి.ప.ఉ.పా.పాపకొల్లు, జూలూరుపాడు మండలం, భద్రాద్రి కొత్త గూడెం
12.తాగు నీరు జి.అభిలాష్, 10వ తరగతి, జి.ప.ఉ.పా. నర్సింహుల పల్లి, పెద్దపల్లి.
13.ధర్మయుద్ధం అద్వైత్ షణ్ముఖ్ ఊటుకూరు 7వ తరగతి, పీటర్ హానెస్ ఎలిమెంటరీ స్కూల్, మౌంటైన్ హౌస్, కాలిఫోర్నియా, అమెరికా
14.నిజమైన స్నేహం రాచకొండ అక్షిత 7వ తరగతి, జి జి.ప.ఉ.పా, చిన్న కోడూరు సిద్దిపేట
15.నిజాయితీ టి.భాను వెంకట్, 9వ తరగతి, అరవింద హై స్కూల్, కుంచనపల్లి
16.పిల్లవాడి తెలివి జి శృతి 9వ తరగతి, జి.ప.ఉ.పా. నర్సింహుల పల్లి, పెద్దపల్లి.
17.ప్రశంస ఆరాధ్య, 6వ తరగతి, సంఘమిత్ర స్కూల్, హైదరాబాద్
18.బలమైన స్నేహం కె. హారిక 7వ తరగతి, అరవింద హై స్కూల్, కుంచనపల్లి
19.మంచిపని శశాంక్ 10వ తరగతి, పోల్లాక్స్ స్కూల్, విశాఖపట్నం
20.మాయా బస్తా పి. ప్రేరణ 7వ తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్
21.మానవత్వం బచ్చాల బ్లెస్సీ 8వ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామంచ సిద్దిపేట జిల్లా
22.మిత్ర ధర్మం కార్తికేయ లక్కి 6వ తరగతి, మొంటె విస్టా మిడిల్ స్కూల్, మౌంటైన్ హౌస్, కాలిఫోర్నియా, అమెరికా
23.మేరా భారత్ మహాన్ కొంగరి అభిషేక్ 2వ సంవత్సరము, బాసర ట్రిపుల్ ఐటి, తెలంగాణ
24.రాజయ్య తెలివి ఏ. వైష్ణవి 10వ తరగతి, జెడ్పిహెచ్ఎస్ నరసింహులపల్లి, పెద్దపల్లి జిల్లా
25.ముగ్గురు అమ్మాయిలు సంయుక్త మేకపోతుల 6వ తరగతి, ఇండియన్ హిల్ స్కూల్, హోం డెల్, అమెరికా
26.రాము చదువు కె. అశ్వత్ 6వ తరగతి, జి.ప.ఉ.పా. నర్సింహుల పల్లి, పెద్దపల్లి.
27.రాము మొండితనం ఎన్. శ్రీ లాస్య 8వ తరగతి, కె.జి.బి.వి.దుబ్బాక
28.సహాయ ఫలితం ఎం. అనన్య 7వ తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్
29.అమ్మాయివిలువ కర్రె గాయత్రి 10వ తరగతి జి.ప.ఉ.పా , రామంచ చిన్నకోడూరు సిద్దిపేట జిల్లా
30.మంచి స్నేహం అశ్విని 10వ తరగతి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏరుగట్ల నిజామాబాద్ జిల్లా
31.సీనియర్ పబ్లిక్ స్కూల్ వై. మహతి 9వ తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్
32.స్వామిజీ మోసం ఎం రామ్ చరణ్, 10వ తరగతి, జి.ప.ఉ.పా. నర్సింహుల పల్లి, పెద్దపల్లి.
33.లక్కీ ఉపాయం డి. రిష్వంత్ 9వ తరగతి జి.ప.ఉ.పా, ఏరుగట్ల నిజామాబాద్ జిల్లా

శ్రీ చదలవాడ వెంకటేశ్వర్లు గారి స్మారక ప్రోత్సాహక బహుమతులు పొందిన వ్యాసాలు (ఒక్కొక్క బహుమతి 150 రూపాయలు)
1.విభిన్న సంస్కృతుల సమ్మేళనం-మన తెలంగాణం ఎమ్. డి. అఫీఫా, 10వ తరగతి, జెడ్పిహెచ్ఎస్ , కోదాడ
2.విద్య ఎన్ హర్షశ్రీ 7 తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్
3.దీపావళి ఏ. కృతి సహస్ర 6వ తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్
4.అమ్మ యం. ఆరాధ్య 6వ తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్
5.భారతదేశంలో మహిళల భద్రత ఉమైజా అఫ్షీన్ 9 తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్
6.గురుశిష్యుల అనుబంధం సిహెచ్ ప్రేర్ణ 9 తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్
7.అడవి దుర్గారాజ్ 8 తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్

శ్రీమతి పాలెపు లక్ష్మీకాంతం గారి స్మారక ప్రోత్సాహక బహుమతులు పొందిన కవితలు (ఒక్కొక్క బహుమతి 100 రూపాయలు)
1.సంక్రాంతి బర్రెడ్డి అంజన్ సాయి వేదాన్ష్ 2వ తరగతి, కలామ్స్ ఇంగ్లీషు మీడియం స్కూల్, శ్రీకాకుళం
2.అక్క- కుక్క దారవేణి అశ్విత 9వ తరగతి, జెడ్పిహెచ్ఎస్ నర్సింహులపల్లి, పెద్దపల్లి.
3.జ్ఞాపకం ఎం. మాధురి 9వ తరగతి, జెడ్పిహెచ్ఎస్ సిర్పూర్, నిజామాబాద్,
4.చెట్టు కన్నం సౌమ్య 6వ తరగతి, జెడ్పిహెచ్ఎస్ , జక్కాపూర్ , సిద్దిపట జిల్లా
5.స్నేహ బంధం టి.అక్షయ 10వతరగతి, కె.జి.బి.వి, దుబ్బాక
6.నేను - నా బాల్యం పి. నందిని 10వ తరగతి, జెడ్పిహెచ్ఎస్ సిర్పూర్, నిజామాబాద్
7.ప్రకృతి సి. ప్రేక్ష 10వ తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్
8.సంధ్యా సమయ సౌందర్యం.. పెద్దకదప సాయి రిషిత, 12వ తరగతి, నారాయణ కాలేజ్, అనంతపురం
9.చెరువు సింగం శశాంత్ 8వ తరగతి, జెడ్పిహెచ్ఎస్, నర్సింహులపల్లి , పెద్దపల్లి
10.సృష్టిలో అమ్మే గొప్పది సిహెచ్ ప్రేర్ణ 9 తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్
11.మిత్రుడు దారవేణి రిచిత 9వ తరగతి, జి.ప.ఉ.పా. నర్సింహుల పల్లి, పెద్దపెల్లి.
12.గురువే దైవం యం. శ్రీ నిది 8వ తరగతి, జెడ్పిహెచ్ఎస్, ఏరుగట్ల, జిల్లా..నిజామాబాద్
13.మనిషి పి.రాజేష్ 7వ తరగతి, జెడ్పిహెచ్ఎస్, ఏరుగట్ల, నిజామాబాద్
14.బాల్యం -ఆకాశం యం. మేఘన 9వ తరగతి, జెడ్పిహెచ్ఎస్, సిర్పూర్, నిజామాబాద్
15.దీపావళి పి. ప్రేరణ 7 తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్

శ్రీమతి వెంకట రమణమ్మ, శ్రీ నారాయణమూర్తి గన్నవరపు గార్ల స్మారక ప్రోత్సాహక బహుమతి పొందిన కవితలు (ఒకొక్క బహుమతి 100 రూపాయలు)
1.అందం – చందం ఆయుషి 6వ తరగతి, శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్
2.ఆ చేయి నీరడి చేత్ర 7వ తరగతి, జెడ్పిహెచ్ఎస్, సిర్పూర్, నిజామాబాద్,
3.వైకుంఠపాళి పి శ్రేష్ఠ 10వ తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్
4.భక్తి జి. శ్రేష్ఠ 9 తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్
5.నా జ్ఞాపకాలలో పి అక్షయ 10వ తరగతి, జెడ్పిహెచ్ఎస్ సిర్పూర్, నిజామాబాద్,
6.స్నేహితుడు స్నేహం జి రాజశేఖర్ రెడ్డి, 7వ తరగతి, అరవింద హై స్కూల్, కుంచనపల్లి
7.అమ్మ దొనకంటి సుశాంత్ 7వ తరగతి, జెడ్పిహెచ్ఎస్, సిర్పూర్, నిజామాబాద్,
8.మధురమైన భాష సిహెచ్. త్రిశాంతి 10వ తరగతి, అరవింద హై స్కూల్, కుంచనపల్లి
9.మన దేశం ఎం. వెంకట సుప్రజ, 8వ తరగతి.జెడ్పిహెచ్ఎస్ నర్సింహులపల్లి, పెద్దపల్లి
10.నాన్న జి. శృతి 9వ తరగతి, జెడ్పిహెచ్ఎస్ నర్సింహులపల్లి, పెద్దపల్లి.
11.తెలుగు భాష గొప్పతనం శ్రీ నిది 8వ తరగతి, జెడ్పిహెచ్ఎస్, ఏరుగట్ల, జిల్లా..నిజామాబాద్
12.అమ్మా! యం. మేఘన 9వ తరగతి, జెడ్పిహెచ్ఎస్ సిర్పూర్, నిజామాబాద్
13.ఇది కలియుగం అభిలాష్ 9వ తరగతి, జెడ్పిహెచ్ఎస్, ఏరుగట్ల జిల్లా నిజామాబాద్
14.బతుకమ్మ ఎం. అనన్య 7 తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్
15.మాతృభాష జి.అభిలాష్, 10వ తరగతి.జెడ్పిహెచ్ఎస్ నర్సింహులపల్లి, పెద్దపల్లి
16.దీవాళి జె. అన్షిత 6వ తరగతి, విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్, నిజమాబాద్

Send a message to learn more

"ఎన్నెన్నో ఊహలు, మరెన్నో అద్భుతాలు"ఇప్పుడిప్పుడే అక్షరాలు నేర్చుకున్న చేతుల్లోంచి పొందిగ్గా అక్షరాలు కథలుగా కవితలుగా వ్య...
31/12/2024

"ఎన్నెన్నో ఊహలు, మరెన్నో అద్భుతాలు"

ఇప్పుడిప్పుడే అక్షరాలు నేర్చుకున్న చేతుల్లోంచి పొందిగ్గా అక్షరాలు కథలుగా కవితలుగా వ్యాసాలుగా వచ్చినప్పుడు అబ్బురపడతాం. అక్షరాల్లో ఆలోచనల్లో ఆ ఊహల్లో ఆ కోరికల్లో ఏముందో అని వెతుకుతాం.

చిన్నప్పటినుండి రాయడం చదవడం అలవాటుగా ఉన్నవాళ్లు
ఎన్నో రంగాల్లోను, సృజనాత్మకంగాను ఎంతో అభివృద్ధి చెందటం అందరికీ తెలిసిందే. చిన్నపిల్లల్లో రాసే ఆసక్తి అభిరుచి ఉన్న విషయాన్ని ముందుగా గుర్తించేది ఉపాధ్యాయులు ,తల్లిదండ్రులే. పిల్లల ఉత్సాహాన్ని, సృజనాత్మకతను పెద్దలు గుర్తించినప్పుడు ప్రోత్సహించినప్పుడు ఆ పిల్లలు అద్భుతాలను సృష్టిస్తారు. ఉపాధ్యాయ కవులు రచయితలు తమ పాఠశాలల పిల్లల కథల కవితల పుస్తకాలను కూడా ఎంతో శ్రమతో ప్రచురించడం మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ముందు ముందు అద్భుతమైన కవులు రచయితలను సమాజం, ఈతరం తయారు చేసుకోవడానికి ఒక మంచి మార్గం.

ఆలోచించే వాతావరణం, పుస్తకాల లభ్యత పెద్దల ప్రోత్సాహం పిల్లల్లో అనేక శక్తులను వెలికి తీయడానికి ప్రేరణగా నిలుస్తాయి. ఈ దిశగా గడుగ్గాయివారు చేసిన ఈ ప్రయత్నం చాలా చిన్నదిగా కనిపించవచ్చు కానీ నిజానికి చాలా గొప్పది. భూమి గురించి మనుషుల గురించి ఆలోచించే వాళ్లే కదా కావాలి ఇప్పుడు. అలాంటి ఒక తరం నిరంతరం తయారవుతుందంటే అదొక శుభ పరిణామమే ప్రతి కాలానికి.

భూమి గురించి మట్టి గురించి గాలి గురించి ఆకాశం గురించి ప్రేమ గురించి అమ్మ గురించి నాన్న గురించి తల్లిదండ్రుల గురించి పిల్లల ఆలోచనలు ఊహలు రచనలు అద్భుతంగా ఉన్నాయని ఈ రచనలు చదివితే ఎవరైనా చెబుతారు.కవితలు వ్యాసాలు రాయటానికి ఒక వేదిక ఒక అవకాశం కల్పించినప్పుడు విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం రాయటానికి ప్రయత్నించటం ఎన్నో ఊహలకు ఆలోచనలకు వాళ్ళు అక్షర రూపం ఇవ్వటానికి ప్రయత్నించటం సంతోషకరమైన విషయం.

పిల్లల అక్షరాల్లోకి కొందరు పెద్దలు బలవంతంగా ప్రవేశించటం ఈ వ్యాసాల్లో చూస్తాం. ఆన్లైన్లో విషయ సేకరణ ఎప్పటికీ వ్యాసం కాదు. విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని సొంతంగా ఆలోచించి సొంతమాటల్లో రాయగలిగినప్పుడే అది మంచి వ్యాసం అవుతుంది. పెద్దలు పిల్లల్ని ప్రోత్సహించాలి తప్ప, పిల్లలకి తప్పుడు మార్గం చూపించకూడదు. వ్యాసాల విషయంలో నేను గమనించిన ఈ ఒక్క తప్పిదం తప్పితే కవితలు చాలా అద్భుతంగా ఉన్నాయి.

నిజంగా పిల్లలు అద్భుతమైన శక్తులు. భూమి ఒక గొప్ప శక్తి క్షేత్రం. ఎంతో శక్తివంతమైన పిల్లల ఆలోచనలు ఊహలు సహజంగా ఎదగాలి. వాళ్లని వాళ్లుగా ఆలోచించుకోనిద్దాం... చదువుకోనిద్దాం... రాసుకోనిద్దాం... స్వేచ్ఛగా స్వతంత్రంగా సొంతంగా..

పోటీలో పాల్గొన్న అందరు విద్యార్థులకు ప్రేమ పూర్వక అభినందనలు. ఇంత విశాలమైన ప్రపంచంలో ఒకానొక అద్భుతమైన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు, ఈ రచనలు చదివే అవకాశం నాకు కల్పించినందుకు గడుగ్గాయివారికి
కృతజ్ఞతలు వందనాలు..

పలమనేరు బాలాజి,
9440995010,
పలమనేరు, చిత్తూరు జిల్లా,
ఆంధ్రప్రదేశ్.

గడుగ్గాయ్ సంక్రాంతి పోటీలకి చిన్నారులు పంపిన వందల కొలది రచనల్లోంచి, బహుమతులని ఎంపిక చెయ్యడం చాలా కష్టమైన విషయమే. కథల ఎంపికకు శ్రీమతి నిర్మల ఘంటశాలగారు, కవితలు, వ్యాసాల ఎంపికకు శ్రీ పలమనేరు బాలాజీ గారు సహకరించారు. వారికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

31/12/2024

*జనవరి 1న గడుగ్గాయ్ సంక్రాంతి పోటీ ఫలితాలు*

ఈ సంవత్సరం గడుగ్గాయ్ సంక్రాంతి పోటీలలో గెలుపొందిన చిన్నారులకి డా. గన్నవరపు నరసింహమూర్తి గారు బహుమతులను అందజేస్తున్నారు. వారి సహృదయతకి గడుగ్గాయ్ కమిటీ తరఫున అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

"చిన్నప్పుడు వ్యాసరచన పోటీల్లోను, ఇతర పోటీల్లోనూ వచ్చిన బహుమతులు, నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వడమే గాక, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాయి. నాకు లభించిన నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ నా వైద్యవిద్యకు ఎంతగానో తోడ్పడింది. ఇప్పుడు బాలబాలికలను ప్రోత్సహించడం నా వంతు. ఈ బహుమతులు ఇంకా మంచి రచనలు చెయ్యడానికి చిన్నారులను ప్రోత్సహిస్తాయని భావిస్తున్నాను. అమ్మా, నాన్న శ్రీమతి వెంకట రమణమ్మ, శ్రీ నారాయణమూర్తి గన్నవరపు గార్లను ఈ విధంగా స్మరించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. పోటీలో పాల్గొన్న చిన్నారులందరికీ అభినందనలు, ఆశీస్సులు.
డా. గన్నవరపు నరసింహమూర్తి, కాలిఫోర్నియా, అమెరికా

ఈ సంవత్సరం గడుగ్గాయ్ సంక్రాంతి పోటీలలో పాల్గొన్న చిన్నారులకి ప్రోత్సాహక బహుమతులని డా. గన్నవరపు నరసింహమూర్తి గారు, శ్రీమతి అమృతవల్లి కవి (అక్కరాజు) గారు, డా. ఉదయశ్రీ చదలవాడ గారు అందిస్తున్నారు. వీరు మువ్వురికీ గడుగ్గాయ్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

నాకు తెలుగుభాష అన్నా, కథలన్నా ఎంతో ఎంతో ఇష్టం. మా అమ్మమ్మ శ్రీమతి పాలెపు లక్ష్మీకాంతం గారు నాకు ఎన్నో అద్భుతమైన కథలు చెప్పేవారు. ఆమె స్మృతిలో చిన్నారులకి ప్రోత్సాహక బహుమతులు అందజెయ్యడం నాకెంతో సంతోషాన్ని, సంతృప్తిని కలుగజేస్తోంది. గడుగ్గాయి పత్రికలో నేను కూడా ఒక భాగమని చెప్పడానికి గర్వంగా కూడా ఉంటుంది. పోటీలో పాల్గొన్న పిల్లలకి అభినందనలు.
అమృతవల్లి కవి (అక్కరాజు), అమెరికా

చిన్న పిల్లలన్నా, చిన్నపిల్లలతో పనిచెయ్యడమన్నా చాలా ఇష్టమైన నాకు, గడుగ్గాయిలో ప్రతి నెలా పిల్లలు వ్రాసిన రచనలు చదవడం, సరిచెయ్యడం ఎంతో సంతోషాన్ని కలగజేస్తోంది. మా నాన్నగారు శ్రీ చదలవాడ వెంకటేశ్వర్లు గారిని స్మరిస్తూ, పిల్లలకి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వగలగడం అదృష్టంగా భావిస్తున్నాను.
డా. ఉదయశ్రీ చదలవాడ, చెన్నై

Send a message to learn more

డిసెంబర్ 2024 సంచిక ఇదిగో చిన్నారులూ! చదివి, మీ అభిప్రాయాలు తెలియజేయండి. మీరు వ్రాసిన కథలు, కవితలు, వ్యాసాలు, మీరు గీసిన...
20/12/2024

డిసెంబర్ 2024 సంచిక ఇదిగో చిన్నారులూ! చదివి, మీ అభిప్రాయాలు తెలియజేయండి. మీరు వ్రాసిన కథలు, కవితలు, వ్యాసాలు, మీరు గీసిన బొమ్మలు, [email protected]కి పంపండి. గడుగ్గాయ్ పత్రికని ఇక్కడ చదవండి. www.telugutalli.ca/kidz

27/10/2024

ఊ….కొడతారా? World children story telling

ఆగస్ట్ గడుగ్గాయి ఇదిగో పిల్లలూ www.telugutalli.ca/kidz
24/10/2024

ఆగస్ట్ గడుగ్గాయి ఇదిగో పిల్లలూ www.telugutalli.ca/kidz

అక్టోబర్ గడుగ్గాయి ఇదిగో పిల్లలూ....www.telugutalli.ca/kidz
24/10/2024

అక్టోబర్ గడుగ్గాయి ఇదిగో పిల్లలూ....www.telugutalli.ca/kidz

నమస్తే. మీకు తెలిసిన పిల్లలు తెలుగు కథలు కవితలు వ్రాయడానికి ప్రోత్సహిస్తూ, మీ వాల్ మీద దీన్ని పంచుకోవలసిందిగా కోరుతున్నా...
14/10/2024

నమస్తే. మీకు తెలిసిన పిల్లలు తెలుగు కథలు కవితలు వ్రాయడానికి ప్రోత్సహిస్తూ, మీ వాల్ మీద దీన్ని పంచుకోవలసిందిగా కోరుతున్నాము.

చిన్నారులూ.. జులై సంచిక ఇదిగో.. మీకు నచ్చిన అంశాలు తెలియజేస్తారు కదూ.. www.telugutalli.ca/kidz
10/07/2024

చిన్నారులూ.. జులై సంచిక ఇదిగో.. మీకు నచ్చిన అంశాలు తెలియజేస్తారు కదూ.. www.telugutalli.ca/kidz

గడుగ్గాయి జూన్ 2024 సంచిక ఇదిగో పిల్లలూ. పెద్దలు కూడా చదివి, అభిప్రాయం తెలియజేస్తారని కోరుతున్నాము. https://telugutalli....
13/06/2024

గడుగ్గాయి జూన్ 2024 సంచిక ఇదిగో పిల్లలూ. పెద్దలు కూడా చదివి, అభిప్రాయం తెలియజేస్తారని కోరుతున్నాము.
https://telugutalli.ca/kidz

గడుగ్గాయి ఏప్రిల్ 2024 సంచిక ఇదిగో పిల్లలూ.  www.telugutalli.ca/kidz
17/04/2024

గడుగ్గాయి ఏప్రిల్ 2024 సంచిక ఇదిగో పిల్లలూ. www.telugutalli.ca/kidz

Address


Alerts

Be the first to know and let us send you an email when Gaduggaai గడుగ్గాయ్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gaduggaai గడుగ్గాయ్:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share