# LOC (Letter of Credit) అందించిన Venkat Gottumukkala అన్న....
ప్రకాశం జిల్లాకు చెందిన తమ్మిశెట్టి సుబ్బారావు s/o తమ్మిశెట్టి కోటిస్వామి గారు 20 సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి కూకట్పల్లి లోని బాలాజీనగర్ లో నివాసం వుంటున్నారు... సుబ్బారావు గారు గత కొద్ది కాలంగా గుండె సంబంధిత నొప్పితో బాధపడుతూ పంజాగుట్ట లోని నిమ్స్ హాస్పిటల్ లో చేరడం జరిగింది. సుబ్బారావు గారికి గుండెకి సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించడం జరిగింది...
నిరుపేదరికంలో ఉన్న వారు సర్జరీ నిమిత్తం కూకట్‌పల్లిలోని BRS (TRS)పార్టీ కార్యాలయానికి కి వచ్చి Gottumukkala Venkateshwara Rao గారిని సంప్రదించగా వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వ సహకారంతో LOC (Letter of Credit)...ద్వారా 3,50000 మంజూరు చేపించడం జరిగింది.
ఆ సంబంధిత లెటర్ ని పార్టీ కార్యాలయంలో సుబ్బారావు గారికి అందజేయడం జరిగింది...
ఈ సందర్భంగా సుబ్బారావు గారు వారి సతీమణి శివలీల గారు KCR గారికి GVR గారిక
పెద్దాయనకి ఉన్న ముందు చూపే తెలంగాణకు శ్రీ రామ రక్షా ! 🙏🙏
Happy birthday kcr Sir....
#కెసిఆర్ #అభిమాన #సంఘం #మున్నూరు #రవి ఆధ్వర్యంలో ప్రతి యేటా అన్నదానం కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం నాంపల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా #అన్నదానం మరియు #దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.
#HappyBirthdayKCRsir💐
సీఎం కేసీఆర్ శక్తి, యుక్తి, వ్యూహాల వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు ఈ రోజు అసెంబ్లీలో మైనార్టీల అంశంపై మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పట్టుదలను అక్బరుద్దీన్ విశేషంగా కీర్తించారు. తెలంగాణను ఎవరో ఇచ్చారని అంటే నమ్మలేమని, కేసీఆర్ అనుసరించిన వ్యూహాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ఓవైసీ అన్నారు సీఎం కేసీఆర్‌ను కేవలం సీఎం కేసీఆర్ గా గౌరవించడం లేదని, ఆయన్ను సీఎం కేసీఆర్ గా గుర్తించడం చాలా చిన్న విషయమే అవుతుందని అక్బరుద్దీన్ అన్నారు. తెలంగాణను తెచ్చింది కేసీఆరే అని ఎంఐఎం నేత తెలిపారు. తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకురావడం మామూలు విషయం కాదు అని, మేం మద్దతు ఇచ్చాం, మేమే ఇచ్చామని జనం అంటుంటారని, మేం ఇచ్చామని ఎవరన్నా అంటే అందులో నిజం లేదని, మీరు ఇవ్వాల్సి వచ్చిందని ఓవైసీ అక్బరుద్దీన్
2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంఐఎం దే హవా కొనసాగుతుందిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ధీమా వ్యక్తం చేశారు ఈ రోజు అసెంబ్లీలోఅక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దృష్టిలో ఏ కులమైనా ఏ మతమైనా సమానమే అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. కేసీఆర్ అందరినీ సమానంగా చూస్తున్నారని కొనియాడారు. కేసీఆర్ స్థాయికి ముఖ్యమంత్రి పదవి చాలా చిన్నదని పేర్కొన్నారు. 2019లో టీఆర్ఎస్ మాత్రమే అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్‌కు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయన్నారు. మైనార్టీల సంక్షేమానికి సీఎం నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. మైనార్టీల సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఎమ్మెల్యే ఓవైసీ మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో మైనార్టీలు బడ్జెట్ కోసం పోరాటం చేశారన్నారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదన్నారు. ముస్లింల అభివృద్ధికి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఉద్ఘాటించారు. కేసీఆర్ వచ్చాకే ఫీజురియింబర్స్‌మెంట్ విషయంలో ముస్లిం విద్యార్థులకు న్యాయం జరిగింది. షాదీముబారక్ స్కీం తెచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు ఓవైసీ. 70 ఏళ్లుగా కాంగ్రెస్ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు ఇచ్చింది వైఎస్ మాత్రమేనని చెప్పారు. మజ్లిస్ ఒత్తిడితోనే అప్పుడు వైఎస్ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.
పూజారులను ఎంత గౌరవిస్తారో అదే స్థాయిలో ముస్లిం, క్రిస్టియన్ల మత పెద్దలను కూడా గౌరవిస్తారని తెలిపారు. గత ప్రభుత్వం ఇమామ్, మౌజంల గురించి ఆలోచించలేదన్నారు. తొలిసారిగా ఇమామ్, మౌజంలకు రూ. వెయ్యి జీవనభృతి అందించడం గొప్ప విషయమని కితాబిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మైనార్టీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్‌ను సీఎం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ తప్ప ఏ ప్రభుత్వమూ ముస్లిం, మైనార్టీలను పట్టించుకోలేదని స్పష్టం చేశారు ఓవైసీ.